డిసెంబర్‌లో ‘బింబిసార’ రిలీజ్ ?

ఒక పక్క హీరోగానూ, మరో పక్క నిర్మాతగానూ ఫుల్ బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ’బింబిసార’. ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క అప్డేట్ రాలేదు. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందో లేదో కూడా సమాచారం లేదు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ’బింబిసార’ సినిమా డిసెంబర్ లో విడుదల కానున్నట్టు సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2న ఓ సీనియర్ స్టార్‌హీరో సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రదర్శనతో పాటు ’బింబిసార’ విడుదలతేదీతో కూడిన ట్రైలర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.
నిజానికి ’బింబిసార’ సినిమా చారిత్రకం కాదు. ఇదో టైమ్ ట్రావెల్ చిత్రమట. ’ఆదిత్య 369’ తరహాలో టైమ్ మెషిన్ లో హీరో ’బింబిసార పరిపాలనా కాలానికి చేరుకుంటారట. అప్పుడు జరిగే ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. శ్రీవశిష్ట్ దర్శకత్వంలో భారీ బ్జటెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త విూనన్ కథానాయికగా నటిస్తోంది. ’ఎంత మంచివాడవురా’ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించే చిత్రం ఇదే అవడం విశేషం.