రికార్డు స్థాయిలో ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌కు ప్లాన్‌..!

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న పాన్‌ ఇండియన్‌ సినిమా ’రాధేశ్యామ్‌’. ఈ సినిమా 2022, జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా 7 భాషలలో రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికోసం రికార్డ్‌ స్థాయిలో థియేటర్స్‌ను లాక్‌ చేసినట్టు తాజా సమాచారం. యంగ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను నార్త్‌లో రిలీజ్‌ చేయడానికి గానూ 3500 స్క్రీన్స్‌ను ఇప్పటికే లాక్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సరిగ్గా వారం రోజులు ముందు రాజమౌళి రూపొందిస్తున్న ’ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ కానుంది. అయినా కూడా ’రాధేశ్యామ్‌’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటినుంచే థియేటర్స్‌ను ఆక్యుపై చేసుకుంటున్నారట. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ ` ప్రమోద్‌ ` ప్రసీద భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ’ఈ రాతలే’ సాంగ్‌ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్‌ అవుతోంది.