అక్టోబర్ 16 నుంచి 2022 టీ20 వరల్డ్ కప్
అక్టోబర్ 16 నుంచి 2022 టీ20 వరల్డ్ కప్
టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసిన రెండు రోజులకే ఐసీసీ వచ్చే మెగా ఈవెంట్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది జరిగిన టీ20 డేట్లనే ఒక రోజు ముందుకు మార్చారు. అక్టోబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్నది. డిఫెండిరగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే సూపర్ 12కు అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ జనవరిలో ప్రకటిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో మొత్తం 45 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటిలాగే రెండు గ్రూప్‌లుగా చేసి ముందుగా సూపర్ 12 మ్యాచ్‌ల ద్వారా సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేస్తారు.
అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ వేదికల్లో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 9న సిడ్నీలో, రెండో సెమీ ఫైనల్ నవంబర్ 10న అడిలైడ్‌లో నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 13న ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పలు సిరీలు రద్దయ్యాయి. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను 2022కి వాయిదా వేశారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌నే విడుదల చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం 2021లో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ ముగిసిన కొన్ని నెలలకే ఇండియా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. క్రికెట్ ఫ్యాన్స్‌కు వరుసగా మూడు ఏళ్లలో మూడు వరల్డ్ కప్‌లు చూసే అవకాశం లభించింది. అయితే సూపర్ 12కు నేరుగా అర్హత సాధించని శ్రీలంక, వెస్టిండీస్, స్కాట్లాండ్, నమీబియా దేశాలు మరోసారి తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడతాయి. ఈ నాలుగింటిలో రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగనున్న తొలి పురుషుల టీ20 వరల్డ్ కప్ ఇదే. ఇక డిఫెండిరగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తమ సొంత గడ్డపై వరల్డ్ కప్ ఆడుతుండటం ఆ జట్టుకు కలసి వచ్చే అంశం. ఇక ఈ వరల్డ్ కప్‌కు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ టికెట్ల కోసం రిజిస్ట్రేషన్‌ను కూడా ఐసీసీ ప్రారంభించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.