Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

న్యూజీలాండ్‌ కొత్త కెప్టెన్‌గా టిమ్‌ సౌథీ

టీ20 వరల్డ్‌ కప్‌  ఫైనల్‌లో ఓటమి అనంతరం న్యూజీలాండ్‌ జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. బుధవారం నుంచి టీమ్‌ ఇండియాతో  మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనున్నది. మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. జైపూర్‌, రాంచీ, కోల్‌కతా వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లకు తాను దూరం అవుతున్నానని ప్రకటించడంతో.. కొత్త కెప్టెన్‌గా టిమ్‌ సౌథీని న్యూజీలాండ్‌ క్రికెట్‌ బోర్డు నియమించింది. అయితే రెండు టెస్టుల సిరీస్‌కు మాత్రం కేన్‌ విలియమ్‌సన్‌ అందుబాటులోకి రానున్నాను. టెస్టులపై దృష్టిపెట్టేందుకే ఇండియాతో టీ20 సిరీస్‌కు దూరం అవుతున్నట్లు కేన్‌ మామ చెప్పుకొచ్చాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం కాన్పూర్‌, ముంబై వేదికలుగా టెస్టు సిరీస్‌ జరుగనున్నది.

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ అయిన న్యూజీలాండ్‌ 2021-23 సైకిల్‌ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఆడనున్న తొలి టెస్టు సిరీస్‌ ఇదే. కీలకమైన ఈ సిరీస్‌ గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో బోణీ చేయాలని చూస్తున్నది. అయితే న్యూజీలాండ్‌ జట్టు గత కొన్నాళ్లుగా తీరిక లేని క్రికెట్‌ ఆడుతున్నది. ముఖ్యంగా కెప్టెన్‌ విలియమ్‌సన్‌ స్వదేశంలో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడి.. ఆ తర్వాత ఐపీఎల్‌ 2021, టీ20 వరల్డ్‌ కప్‌లో పాల్గొన్నాడు. వరుసగా ప్రయాణాలు, సిరీస్‌లతో అలసిపోయాడు. టీ20 వరల్డ్‌ కప్‌ కూడా ముగిసి మూడు రోజులే అవుతున్నది. ఆటగాడిగా, కెప్టెన్‌గా మానసికంగా, శారీరికంగా అలసిపోవడంతోనే కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు.

దుబాయ్‌ నుంచి నేరుగా జైపూర్‌ చేరుకున్న కేన్‌ విలియమ్‌సన్‌ అండ్‌ టీమ్‌ రేపటి నుంచి టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. అయితే కేన్‌ మామ టీ20 నుంచి తప్పుకొని టెస్టు జట్టుతో కలిశాడు. ప్రస్తుతం జైపూర్‌లోనే టెస్టు క్రికెట్‌ జట్టు సభ్యులు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే కొంత మంది క్రికెటర్లు టెస్టు, టీ20 జట్టులో సభ్యులుగా ఉన్నారు. కేల్‌ జేమిసన్‌, డాలిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్‌, మిచెల్‌ సాంట్నర్‌లు ఇరు జట్లలో ఉన్నా.. ప్రస్తుతం టీ20 జట్టుతో కలసి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వీరితోనే ఉన్న టిమ్‌ సౌథీని కెప్టెన్‌గా నియమించారు. ఇక కుడి పిక్క గాయంతో బాధపడుతున్న లాకీ ఫెర్గూసన్‌ కోలుకుంటున్నాడని.. టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని న్యూజీలాండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. న్యూజీలాండ్‌ టీ20 జట్టు: టాగ్‌ ఆస్లే, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్తిల్‌, కేల్‌ జేమిసన్‌, అడమ్‌ మిల్నే, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నిషమ్‌, గ్లెన్‌ ఫిలిప్‌, మిచెల్‌ సాంట్నర్‌, టిమ్‌ సీఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఇష్‌ సోథి, టిమ్‌ సౌథీ (కెప్టెన్‌),