క్రికెట్‌ 8 టోర్నమెంట్ల వేదికలు ప్రకటన

క్రికెట్‌ అభిమానులకు ఐసీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరగనున్నాయి. 2024 టీ20 వరల్డ్‌ కప్‌ యుఎస్‌ఏ, వెస్ట్‌ఇండీస్‌ లో జరగనుంది. 2025 ఛాంపియన్‌ ట్రోఫీకి పాకిస్తాన్‌ వేదిక 2026 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియా, శ్రీలంకలో జరగనుంది. 2027 వరల్డ్‌ కప్‌ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు. 2028 టీ20 వరల్డ్‌ కప్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జరగనుంది. 2029 ఛాంపియన్‌ ట్రోఫీకి ఇండియా వేదిక. 2030 టీ20 వరల్డ్‌ కప్‌ ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ వేదికలు

2031 వరల్డ్‌ కప్‌ ఇండియా, బంగ్లాదేశ్‌ లో జరగనుంది.