మహేశ్‌బాబు మూవీలో లావణ్య త్రిపాఠి?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ’సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1న సినిమాని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూట్ కంప్లీట్ కాగానే.. తదుపరిగా మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాను మొదలు పెట్టనున్నారు. ’అతడు, ఖలేజా’ తర్వాత వీరి కలయికలో వస్తున్న మూడో చిత్రం ఇదే కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ’మహర్షి’ తర్వాత ఈ జోడీ మళ్ళీ అభిమానుల్ని అలరించబోతోంది. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్టు టాక్.
ఈ ఏడాది కార్తికేయ చిత్రం ’చావు కబురు చల్లగా’ చిత్రంలో కథానాయికగా నటించిన లావణ్యకి ఆ సినిమా రిజల్ట్ నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆమెకి త్రివిక్రమ్ లాంటి బడా దర్శకుడు ఛాన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఈ ఆఫర్ లావణ్య త్రిపాఠికి జాక్ పాట్ అనే చెప్పుకోవాలి. ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు.