‘పుష్ప’ స్పెషల్‌ సాంగ్‌లో సమంతకు భారీ రెమ్యునరేషన్‌

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  కెరీర్‌లోనే తొలిసారిగా సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాలుగురోజుల పాటు ఈ సాంగ్‌ షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను సమంత కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

కేవలం ఒక్క పాట కోసం ఇంత భారీ రెమ్యునరేషన్‌ తీసుకోవడం అంటే రికార్డ్‌ అనే చెప్పుకోవాలి. గతంలో స్పెషల్‌ సాంగ్స్‌లో అలరించిన పూజా హెగ్డే, కాజల్‌, తమన్నాలు సైతం ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ అందుకోలేదు. కానీ సమంతకు ఉన్న క్రేజ్‌ను బట్టి కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు సైతం మేకర్స్‌ వెనకాడలేదట. ప్రస్తుతం సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఇండస్టీల్రో హాట్‌ టాపిక్‌గా మారింది