‘ఇండియన్ 2’లో త్రిష ?

కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ’ఇండియన్ 2’. ఇందులో త్రిష హీరోయిన్గా నటించబోతోందనే లేటెస్ట్ న్యూస్ సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతోంది. ’ఇండియన్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ’ఇండియన్ 2’ ఇటీవల వివాదాలనుంచి బయటపడిరది. దాంతో డిసెంబర్ నుంచి తిరిగి షూటింగ్ మొదలవబోతోందని వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ అయింది. కానీ, ప్రస్తుతం తను ప్రగ్నెంట్ కావడంతో ’ఇండియన్ 2’ నుంచి తప్పుకుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాజల్ ప్లేస్‌లో త్రిష వచ్చి చేరబోతోందని కోలీవుడ్ విూడియాలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో స్పష్ఠత రానుందని సమాచారం. ఇక ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.