19న పాక్షిక చంద్రగ్రహణం
-ఉత్తరాది రాష్టాల్రకు మాత్రమే పరిమితం
ఆకాశం ఎన్నో అద్భుతాలకు కొలువు. ఎన్నిసార్లు చూసినా… తనివితీరని దృశ్యాలెన్నో కనువిందు చేస్తూ ఉంటాయి. అలాంటి మరో అద్భుతమైన దృశ్యం త్వరలో జరగనుంది. ఈ నెల 19న అత్యంత అరుదైన పాక్షిక చందగ్రహణం ఏర్పడనుంది. గత 580 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆ రోజు ఎక్కువ సమయం చందగ్రహణం కనువిందు చేయనుంది. ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సోంలోని పలు ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 4 గంటల 15 వరకు ఉంటుంది. అంటే 3 గంటల 25 నిమిషాల 24సెకన్ల పాటు ఈ గ్రహణం కనువిందు చేయనుంది. 1440 ఫిబ్రవరి 14న ఈ తరహా గ్రహణం ఏర్పడిరది. మరలా ఇప్పుడు ఏర్పడుతుంది. మళ్లీ ఈ గ్రహణం 2669వ సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఇంత సుదీర్ఘమైన చందగ్రహణం ఏర్పడుందని శాస్త్రవేత్తలు అంచనా చేస్తున్నారు.