Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భయపెడుతున్న ఉల్లి ధరలు

ధరల దాడి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా కూరగాయలత ధరలతో పాటు నిత్యావసరాల ధరలు మోత మోగిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో పంటలు నీట మునగడంతో ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే టమాటా, ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కనీసం కిలో 60కి అమ్ముతున్నారు. కరోనా కష్టాల నుంచి ఇంకా తేరుకోలేని సామాన్య మధ్య తరగతి ప్రజలకు ధరలదాడి శరాఘాతంలా మారింది. ప్రధానంగా ఉల్లి ధరల ఘాటుతో సామాన్యులు విలవిల్లాడు తున్నారు. సాధారణ మార్కెట్లో దరలు కిలో 60కి అమ్ముతున్నారు.

ఇక ఉప్పులు,ప్పులు, నూనెల ధరలు చెప్పక్కర్లేదు. ఉల్లి సవిూప భవిష్యత్తులో రూ.వందకు చేరినా ఆశ్చర్యం లేదన్న ఆందోళనలు సామాన్యుల ను బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు అల్లం వెల్లుల్లి, కారం,చింతపండు ధరలు కూడా  అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌ ముగిసినా ధరల మోత సామాన్యులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నా యి. ఒక వైపు పంట పండిరచిన రైతులకు సరైన ధర పడక కన్నీరు పెట్టిస్తుండగా మరో వైపు బహిరంగ మార్కెట్‌లో వినియోగదారులకు రేటు ఘాటెక్కిస్తోంది. ఇటీవలికాలంలో ఇలాంటి వైపరీత్యం తరచూ ఎదురవుతోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. కిలో రూ.60కి ఎగబాకింది. అతి వర్షాల కారణంగా టమాటా,ఉల్లి, కూరగాయల ధరల దిగుబడి తగ్గిందని రైతులు కూడా ఒప్పుకుంటున్నారు.

గతంలో ఇలాగే ఉల్లిధరలు పెరిగినప్పుడు దేశీయంగా నిల్వలపై ఆంక్షలు విధించింది. అయితే పండి౦చిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు రావడం లేదని వాపోతున్నారు. ధాన్యం మొదలు ,పత్తి, మిర్చి పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతుల ఉత్పత్తులను ప్రభుత్వం కొనకుండా నగదు బదిలీ రూపంలో ఎంతోకొంత ఇచ్చి చేతులు దులుపుకునే ధోరణిని పైన మోడీ సర్కారు కింద రాష్ట్ర ప్రభుత్వాలు పాదుకొల్పుతుండటంతో రైతులు, వినియోగదార్లు ఇద్దరూ నష్టపోతున్నారు. వ్యాపారులు, దళారులు జేబులు నింపుకుంటున్నారు. దీంతో ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఉల్లి ధర వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు ఏకంగా 60కి చేరుకుంది. మార్కెట్‌లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్టాల్ర అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్టాల్రు పోటీ పడుతున్నాయి. ఫలితంగా డిమాండ్‌ పెరగడంతో ధరలు  కూడా అమాంతం పెరుగుతున్నాయి.

మరోవైపు కర్నూలు జిల్లాలో సైతం మార్కెట్‌లోకి ఉల్లి అంతగా రావడం లేదు. అధిక వర్షాల  కారణంగా ఉల్లి సాగు అనుకున్నంత జరగకపోవడంతో  అవసరమైన సరఫరా లేక ధర పెరుగుతోంది. హైదరాబాద్‌ బహిరంగ మార్కెట్‌లో గతనెల కింద కిలో ఉల్లి రూ. 30 మేర ఉండగా ప్రస్తుతం రూ. .60కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు అంటున్నాయి. పొరుగు రాష్టాల్ల్రో  ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధర కొండెక్కుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ. 15 మేర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 42 నుంచి రూ. 45 పలుకు తుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, కొంతమేర కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది. రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్టాల్రపై ఆధారపడాల్సి వస్తోంది.

సాధారణంగా రాష్ట్ర మార్కెట్‌లకు మహారాష్ట్రలోని షోలాపూర్‌, ఔరంగాబాద్‌, నాసిక్‌, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్‌ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి దిగుమతులు ఉంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. ఇటీవలి వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగుతాయన్న సంకేతాలు ఉన్నాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారులు నిల్వలు పెంచకుండా చూడటం, వారిపై నియంత్రణ చర్యలు చేపడితేనే ఉల్లి ధరలకు క్లళెంపడే అవకాశం ఉంది. లేదంటే మున్ముందు వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిని అధిగమిం చేందుకు బఫర్‌ స్టాక్‌ విడుదల చేసి, నల్లబజారుపై దాడులు చేయాలని సూచిస్తున్నారు.

అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ దాడులను కొనసాగిస్తే తప్ప ఉల్లి ధరలను అడ్డుకోలేమని మార్కెట్‌ వర్గాలే చెబుతున్నాయి.  అదీ నామ్‌కే వాస్తే కొనసాగిస్తున్న కారణంగా బ్లాక్‌ మార్కెట్‌లో ఉల్లి పేరుకుపోయిందన్న వాదనలు ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో వారు కూడా పంటలను తగ్గించారు. రాష్ట్రంలో ఉల్లి పంట రాయలసీమలో, అదీ కర్నూలు జిల్లాలో అధికంగా సాగవుతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.35`45 ఉన్నప్పుడే, కర్నూలు మార్కెట్‌లో ఉల్లి పండిరచిన రైతుల నుంచి క్వింటా లును రూ.వెయ్యి, 1,500కు కొనే దిక్కులేదు. ఆ ధరలు తమకు ఎంత మాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు పంటతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

రైతులకు ధరలు తగ్గిపోవడాని కి సాగు విస్తీర్ణం ఏమన్నా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందా అంటే అదీ లేదు. కొన్నేళ్ల నుంచి ఉల్లి పంటకు ధరల్లేక సాగు క్రమేణ తగ్గుతోంది.  ఈ మారు ఖరీఫ్‌ ప్రారంభంలో రాయలసీమలో తీవ్ర వర్షాభావం నెలకొన డంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు ఉల్లి పంట దెబ్బతింది. పలు రాష్టాల్ల్రో భారీ వర్షాలు, వరదల మూలంగా భారీగా పంట దెబ్బతింది. రవాణా, సరఫరా నిలిచిపోయింది. అవకాశం ఎప్పుడు చిక్కుతుందా ఎప్పుడు దోపిడీ చేద్దామా అని కాచుక్కూర్చున్న వ్యాపారులకు, దళారులకు ఈ పరిస్థితి అనుకూలంగా మారింది. కృత్రిమ కొరత సృష్టించి అధికంగా రేట్లు పెంచేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.