ప్రేమకు వయసుతో సంబంధం లేదు : రష్మిక మందన్నా

ప్రస్తుతం మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది . ’మిషన్‌ మజ్ను’సినిమాతో రష్మిక  బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను అప్పుడే మొదలుపెట్టేసింది  ఈ శాండల్‌వుడ్‌ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తన రిలేషన్‌షిప్‌ స్టేటప్‌పై ఓపెన్‌ అప్‌ అయ్యింది.

విూకంటే చిన్నవాడితో డేటింగ్‌ చేస్తారా అని రష్మికను ప్రశ్నించగా.. ప్రేమకు వయస్సుతో సంబంధం ఏముంది? వారు మిమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు. అప్పుడు ఈజ్‌ అన్నది పెద్ద విషయమేవిూ కాదు అని పేర్కొంది. అయితే కొంతకాలంగా రష్మిక డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇలాంటి స్టేట్‌మెంట్‌ రావడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

ఇక సోషల్‌ విూడియాలో  చొక్కా లేకుండా ఫోజులిచ్చే అబ్బాయిల గురించి మాట్లాడుతూ.. వాళ్లు కష్టపడి ఫిట్‌గా కనిపించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్నా. కానీ దాన్ని విూ ప్గ్రొªల్‌ ఫోటోగా ఎందుకు పెట్టుకుంటున్నారు?  శరీరం కంటే ముందు విూరేంటో వాళ్లకు తెలియాలి కదా అని బుదులిచ్చింది.