15న ‘రాధేశ్యామ్‌’లోని సాంగ్‌ రిలీజ్‌..!

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్‌ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కరోనా వలన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడిరది. అయితే ఈ సినిమా రిలీజ్‌ దగ్గర పడుతున్నా కూడా మేకర్స్‌ పెద్దగా అప్‌డేట్స్‌ ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్‌ చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకరైతే సూసైడ్‌ లెటర్‌ కూడా రాసారు.

గత రెండు రోజుల నుంచి రాధేశ్యామ్‌ ఫస్ట్‌ సింగిల్‌ ని రిలీజ్‌ చేస్తారని సోషల్‌ విూడియాలో టాక్‌ నడుస్తుంది. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఎట్టకేలకు చిత్ర బృందం నవంబర్‌ 15 సాయంత్రం 5గం.లకు ఈ రాతలే అంటూ సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ పాట శ్రోతలకి మంచి వినోదం పంచుతుందని తెలుస్తుంది.

’రాధేశ్యామ్‌’ సినిమాకి హిందీ వర్షన్‌ లో మిథూన్‌, మనన్‌ భరద్వాజ్‌ లు కలిసి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక సౌత్‌ లాంగ్వేజెస్‌ లో జస్టిన్‌ ప్రభాకర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. తాజాగా మనన్‌ భరద్వాజ్‌ తన ఇంస్టాగ్రామ్‌ లో ఓ పోస్ట్‌ చేశారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎడిటింగ్స్‌, రికార్డింగ్స్‌, సంవత్సరాలుగా సహనం.. ్గªనైల్‌ గా తమ హానెస్ట్‌ అటెంప్ట్‌ ’రాధేశ్యామ్‌’ మ్యూజిక్‌ ని ప్రెజెంట్‌ చేసే సమయం వచ్చింది అని పోస్ట్‌ చేశాడు. అంతే కాక విూరందరు ఇది తొందరగా వినాలి అని పోస్ట్‌ చేశాడు. దీంతో సాంగ్స్‌పై అందరిలో ఆసక్తి పెరిగింది.