మరోసారి మారుతితో సాయి ధరమ్‌ తేజ్‌ ..!

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి కలిసి మరోసారి పండగ లాంటి సినిమా చేయబోతున్నారు. ఇంతకముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ’ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. అక్టోబర్‌లో యాక్సిడెంట్‌కు గురైన సాయి తేజ్‌ ప్రస్తుతం పూర్తిగా కోలుకొని కొత్త సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు సిద్దమవుతున్నాడు. యంగ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌ 2022, జనవరి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇది సాయి తేజ్‌ కెరీర్‌లో 15వ సినిమా కాగా.. బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల మారుతి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడిరచాడు. ప్రస్తుతం గోపీచంద్‌ ` రాశిఖన్నా జంటగా ’పక్కా కమర్షియల్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అది పూర్తయ్యాక సాయి తేజ్‌ మూవీని మొదలు పెట్టే అవకాశాలున్నాయి.