బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభం

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల అఖండ సినిమా చిత్రీకరణ పూర్తి చేసాడు బాలయ్య. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. సింహా, లెజెండ్‌ తర్వాత మూడోసారి బాలకృష్ణ` బోయపాటి శీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య అఘోరగా, ఊరుపెద్ద మనిషిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని డిసెంబర్‌ 2న విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఇక బాలకృష్ణ 107వ సినిమా శనివారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, బోయపాటి, వివి వినాయక్‌, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, బాబీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్‌ మలినేని ఈ కథను రాశారు.

ఈ సినిమాలోనూ బాలయ్య డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నారట. అఖండ సినిమాలో డబుల్‌ రోల్‌లో మెప్పించనున్న మరోసారి అలాగే అలరించబోతున్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే, ఓ పాత్రలో ఫ్యాక్షనిస్ట్‌గా మరో పాత్రలో స్వామిజీగా అలరించబోతున్నాడని సమాచారం. చిత్రంలో శృతి హాసన్‌ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.