సమంతది నిజమైన ప్రేమ : ఉపాసన

ఉపాసన`సమంతల స్నేహం గురించి తెలిసిందే. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, మహిళా శక్తి వంటి ఎన్నో విషయాల్లో వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఈ క్రమంలో ఉసాసన`సామ్‌కు మంచి అనుబంధం ఏర్పడిరది. గతంలో ఉపాసన సొంత వెబ్‌సైట్‌ యువర్‌ లైఫ్‌.కో.ఇన్‌కు సామ్‌ గెస్ట్‌ ఎడిటర్‌గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన సమంత గురించి తనకున్న అభిప్రాయంపై ఓపెన్‌అప్‌ అయ్యింది.

’నేను తెలంగాణ బిడ్డను. దసరా వంటి పండుగల సమయంలో కూడా మాంసం తింటాను. అయితే సమంత ఆర్టికల్స్‌ ఎడిట్‌ చేసిన తర్వాత మాంసం తినడం చాలావరకు తగ్గించాను. సమంతలో సాయం చేసే గుణం ఉంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సహాయం చేసింది. సమంతది నిజమైన ప్రేమ’ అని పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.