ఆర్యన్‌ ఖాన్‌కు సోదరి బర్త్‌డే విష్షెస్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ దంపతుల పెద్దద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ 24వ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు, కజిన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  కజిన్‌ ఆలియా షేర్‌చేసిన చిన్ననాటి ఫోటోపై ఆర్యన్‌ చెల్లెలు సుహానా ఖాన్‌ స్పందించింది. అన్నయ్యకు ప్రేమగా లవ్‌ సింబల్‌తో బర్త్‌డే విషెస్‌ తెలిపింది.

ఆ చిన్ననాటి ఫొటోలో చిట్టి సుహానా, అలియా మాట్లాడుతుండగా ఆర్యన్‌, అతని కజిన్‌ అర్జున్‌ ఫొటోకు ఫోజులివ్వడాన?ని మనం చూడొచ్చు. ఆర్యన్‌ కజిన్స్‌ అలియా చీబా, అర్జున్‌ చిబా సోషల్‌ విూడియా వేదికగా ఫొటోలు షేర్‌ చేస్తూ బర్త్‌ డే బాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యన్‌ ఖాన్‌ 24వ పుట్టిన రోజు సందర?భంగా అతని సోదరి సుహానా ఖాన్‌ షేర్‌ చేసిన చిన్ననాటి ఫొటో ఇప్పటికే వైరల్‌ అవుతోంది.