Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కోటి నలబై రెండు లక్షల గంజాయి స్వాధీనం

గంజాయి స్మగ్లర్ల అక్రమ రవాణాను పసిగట్టి పట్టుకున్న సత్తుపల్లి పోలీసులు

కోటి నలబై రెండు లక్షల విలువ చేసే 566 కేజీల గంజాయి స్వాధీనం

ఆంద్రప్రదేశ్, మారేడుమిల్లి నుంచి లారీలో మహారాష్ట్ర కు పోడి గంజాయి రవాణా

ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు…పరారీ మరో నిందుతుడు..

గంజాయి అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక వ్యూహంతో సత్ఫలితాలు

గంజాయి తరలింపు మూలాలను పసిగట్టే పనిలో ప్రత్యేక బృందాలు

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్

విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీపీ వేంకటేశ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి సిఐ రామకాంత్ తన సిబ్బందితో పట్టణంలోని JVR పార్క్ సమీపంలో బుధవారం సాయంత్రం చేపట్టిన వాహన తనిఖీల్లో MH 23 AU 7377 నెంబరు గల ట్రాలీ లారీలో నిషేధిత పోడి గంజాయి తరలిస్తున్న గుర్తించి వాహనాన్ని, ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ వివరాలు వెల్లడించారు.

పరారీలో వున్న A3 నిందుతుడు గణేష్ ఉబాలే సూచనలతో సుమారు కోటి నాలబై రెండు లక్షల విలువ గల 566 కేజీల నిషేధిత గంజాయిని ఆంద్రప్రదేశ్, విశాఖపట్నంలో ఆటవీ ప్రాంతాలలో ట్రాలీ లారీలోని క్రింది భాగంలో రహస్యంగా అమర్చి మారేడుమిల్లి, రాజమండ్రి , సత్తుపల్లి మీదుగా పోలీసులకు దొరకకుండా కట్టుదిట్టంగా మహారాష్ట్రలోని ఆహ్మద్ నగర్ ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు పట్టుబడ్డ నిందుతులు పోలీస్ విచారణలో వెల్లడించారని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దుల మీదుగా గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు, అందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి తరలింపు మూలాలను పసిగట్టే పనిలో వున్నాయని తెలిపారు. పరారీలో ఉన్న ఏ 3 నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ సత్తుపల్లి పోలీసులను అభినందించారు.