టాలీవుడ్‌లో మల్లికా షెరావత్ ఎంట్రీ..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. గతంలో చాలాసార్లు ఆమె తెలుగు సినిమాలలో నటించబోతోందనే వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. కానీ, అవి కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఎట్టకేలకి మల్లికా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ’నాగమతి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రంలో నటిస్తుండగా, అమ్రిష్ గణెళిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ముంబైలో ప్రారంభం అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి౦చనున్నారు.