మంచు విష్ణుకు జంటగా ఫరియా అబ్దుల్లా..

మంచు విష్ణుకు జంటగా నటించే అవకాశం అందుకుంది యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన ’జాతి రత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఫరియా మొదటిసినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా కూడా తను ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇంతకముందు మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఫరియా ఎంపికైందనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని రవితేజ సినిమాలలో హీరోయిన్స్‌ను చూశాక క్లారిటీ వచ్చింది. కాగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు ’డి అండ్ డి’ అనే సినిమా చేస్తున్నారు. ’డబుల్ డోస్’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కబోతున్న ఇందులో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేసుకున్నట్టు దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ప్రకటించారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు ఆయన తెలిపారు.