‘3 రోజెస్‌’ ట్రైలర్‌ విడుదల

దర్శకుడు మారుతి తెలుగు ఓటీటీ కోసం 3 రోజెస్‌ అనే వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. పాయల్‌ రాజ్‌ పుత్‌ ,ఈషా రెబ్బా , పూర్ణ ప్రధాన పాత్రలో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ’3 రోజెస్‌’ ఫస్ట్‌

లుక్‌, హీరోయిన్ల క్యారక్టర్‌ పోస్టర్స్‌ , టీజర్‌ ఆకట్టుకున్నాయి. నవంబర్‌ 12న ఈ సిరీస్‌ని ఆహా లో ప్రీమియర్‌ గా స్టీమ్రింగ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో 3 రోజెస్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

ట్రైలర్‌ ను స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రిలీజ్‌ చేసి టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రీతూ , జాన్వీ, ఇందు అనే ముగ్గురు ఆధునిక స్వతంత్ర భావాలు కలిగిన ఈ తరం అమ్మాయిల జీవితాలను 3 రోజెస్‌ వెబ్‌ సిరీస్‌ లో చూపించబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. ఫ్రీడమ్‌ కోరుకుంటూ వేరే వ్యక్తి నీడలో ఎందుకు బ్రతకాలి? అనుకునే ఈ ముగ్గురి పెళ్లి చుట్టూ జరిగిన సంఘటనలను ఇందులో ప్రస్తావించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వెబ్‌ సిరీస్‌ ఉంటుందని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది.

తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం ’ఆహా’ వైవిధ్యమైన కార్యక్రమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది. సూపర్‌ హిట్‌ సినిమాలను, టాక్‌ షోలను, వెబ్‌ సిరీస్‌ లను అందిస్తూ దూసుకుపోతున్న ఆహా నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా అన్‌ స్టాపబుల్‌ అనే షో విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌ 3 రోజెస్‌తో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించనున్నట్టు తెలుస్తుంది.