చిరు న్యూ మూవీ భోళా శంకర్‌ ప్రారంభం..

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ’భోళా శంకర్‌’. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరు సరసన హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా కనిపించబోతోంది. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ’వేదాళం’కు అఫీషియల్‌ తెలుగు రీమేక్‌ ’భోళా శంకర్‌’. కాగా నేడు (నవంబర్‌ 11) ఈ మూవీ ప్రారంభోత్సవం కార్యక్రామాలను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, బి.గోపాల్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ, వి వి వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని, బాబీ, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. అలాగే, హీరోయిన్‌ తమన్నా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. మెగా 155గా రూపొందనున్న ఈ మూవీ నవంబర్‌ 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవబోతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్‌ సంగీత దర్శకుడు.