Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చర్చలు ఎప్పుడూ అవసరమే ! 

నదుల అనుసంధానం పేరుతో దేశవ్యాప్తంగా జలవనరులపై తన పెత్తనం రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం పావులు కదుపుతోంది. నదీజలాల విషయం లోనే కాదు, మిగిలిన అన్ని అంశాల్లోనూ రాష్టాల్ర హక్కులను, అధికారాలను కబళించడమే మోడీ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. విద్యుత్‌ రంగం లోనూ ఇలాంటి పోకడలనే ఎంచుకుంది. నదుల అనుసంధానం ఎప్పుడో వెనక్కి పోయింది. కృష్ణ, గోదావరి జలాల విషయంలో కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు క్లళెదుటే ఉంది. పొరుగు రాష్ట్రంతో ఏర్పడిన సమస్యను సామరస్యంగా పరిష్కరించ డానికి బదులు సర్వాధికారాలను మోడీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. బోర్డుల పేరుతో ప్రాజెక్టుల నుండి పిల్లకాల్వల వరకు తన పరిధి లోకి తీసుకోవడం, తాము చెప్పినట్టుగానే స్థానిక ప్రభుత్వాలు వ్యవహ రించాలని చెప్పడం రాష్టాల్ర హక్కులపై దాడులు చేయడమే!

అవసరముంటే..ఎన్నికల ముందు ఇలాంటి సమస్యలను ముందుకు తీసుకుని రావాడం బిజెపికి అలవాటని సిఎం కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యల్లో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది. రాష్టాల్ర కున్న అధికారాలను లాక్కోవడం మినహా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్దగా చొరవ చూపడం లేదు. ఇందుకు నదీజలాల వివాదాలే నిదర్శనం. ఇటీవల ఆంధప్రదేశ్‌, ఒడిషా రాష్టాల్ర ముఖ్యమంత్రులు ముఖాముఖి చర్చలు జరపడం ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో కెసిఆర్‌, జగన్‌ కూడా నదీజలాలపై చర్చించారు. అయితే కారణాలు ఏవైనా అవి ముందుకు సాగలేద. తాజాగా ఎపి సిఎం జగన్‌ కూడా ఒడిషాతో సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సిఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చించారు. ఈ రెండు రాష్టాల్ర మధ్య ఉన్న సమస్యలు అంత తీవ్రమైనవి కూడా కావు. వంశధార, జంజావతి వంటి సాగునీటి ప్రాజెక్టుల సమస్యలు పరిష్కారమైతే రెండు రాష్టాల్ర ప్రజలకూ ప్రయోజనకరమే. అందుకే సమస్య చిన్నదే అయినా పెద్ద అడుగు పడి౦ది.

కొఠియా గ్రామాలది సరిహద్దు అంశంగా చెబుతున్నప్పటికీ అంతకు మించి ఆ గ్రామాల ప్రజల సమస్యగా దీనిని చూడాలి. ఈ గ్రామాల్లోని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం వంటి అనేక అంశాలు ఈ సమస్య పరిష్కా రం చుట్టూ ముడిపడి ఉన్నాయి. పోలవరం, జల విద్యుత్‌ ప్రాజెక్టు వంటి అంశాలు కూడా ఇటువంటివే! అయినా, ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయని ప్రకటించడం ఒక ముందడుగు. రెండు రాష్టాల్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఏర్పాటైన సంయుక్త కమిటీ ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఇరు రాష్టాల్ర సి.ఎం లు సమావేశం కావడం, సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించు కోవడమన్నది ఒక కీలక పరిణామంగానే చూడాలి. ఈ తరహా చర్చలు రాష్టాల్ర మధ్య సమస్యల పరిష్కారానికి దోహదం చేయడమే కాదు, ఫెడరల్‌ వ్యవస్థ బలోపేతానికి దారి తీస్తుంది. ఇలాంటి అవకాశాలను ఆయా రాష్టాల్ర సిఎంలు తమకుతాముగా పరిస్కరించుకోవాలి. అదేపనిగా కేంద్రంపై ఆధారపడకుండా ముందుకు సాగాలి. ఇది దేశాన్ని మరింత పరిపుష్టం చేయడానికి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి దోహదం చేస్తుందని చెప్పు కోవాలి. ఈ తరహా సంప్రదింపులే కృష్ణా జలాలను తమిళనాడుకు అందించే తెలుగు గంగ పథకాన్ని సాకారం చేశాయి.

తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సమస్యల పరిష్కారానికి పరస్పర చర్చలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ఒడిషాతోనే కాకుండా ఇతర పొరుగు రాష్టాల్రతో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి సంప్రదింపుల మార్గాన్నే అనుసరించాలి. నాయకుల మధ్యనే కాదు, రెండు రాష్టాల్ర సాధారణ ప్రజల
మధ్య కూడా ఈ తరహా చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయి. అపోహలు తొలగిపోతాయి. సమస్యలపై చర్చించడం వల్ల విస్తృత అభిప్రాయం వస్తుంది. మొత్తంగా ఓ అడుగు పడింది పెద్దడుగుగానే భావించాలి. అలాగే సమస్యల పరిస్కారం అవుతుండడంతో ఆశలు చిగురించాయి. ముఖ్య మంత్రుల స్థాయిలో చర్చలు 34 ఏళ్ల తర్వాత మళ్లీ జరగడమే ఓ ముందడుగా భావించాలి. సమస్యలపై సానుకూలంగా చర్చ సాగింది కనుక ఇరు రాష్టాల్రకూ మేలు జరగనుంది.

వంశధార జల వివాదంతో శ్రీకాకుళం జిల్లాలో ఆరు దశాబ్దాలుగా నేరడి బ్యారేజీ నలుగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణం న్యాయబద్ధ మేనని పలు సందర్భాల్లో ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చినా ఒడిశాను ఒప్పించే పని ఇప్పటివరకు జరగలేదు. 1987 జనవరి 15న న్యూఢల్లీిలో అంతర్రాష్ట్ర సమావేశంలో అప్పటి ఎపి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌, ఒడిశా సిఎం బిజూ పట్నాయక్‌ మధ్య చర్చలు జరిగాయి. నేరడి బ్యారేజీకి ఎగువన ఒడిశా ప్రాంతంలో 3.80 కిలోవిూటర్ల రక్షణ గోడ నిర్మాణంతో పాటు ఒడిశాలో బ్యారేజీ నిర్మాణ కట్టడాలను 106 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసేందుకు ఇరువురు ముఖ్యమంత్రులూ ఆనాడే అంగీకరించారు. ఆ తర్వాత ఆయా రాష్టాల్లో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారడం తదితర కారణాలతో ఒప్పందం అమలు కాలేదు. వంశధార ప్రాజెక్టు స్టేజ్‌`2లో భాగంగా నిర్మించాల్సిన నేరడి బ్యారేజీ ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లాలోని గుణుపూర్‌, గుడారి ప్రాంతాలు మునిగిపోతాయని, గంజాం జిల్లాలోని బడిగాం, సర ప్రాంతాల భూములకు నష్టం వాటిల్లితుం దని ఒడిశా వాదన.

నేరడి బ్యారేజీ నిర్మాణం చేపట్టవచ్చని 2017లో ఎపికి అనుకూలంగా ట్రిబ్యులన్‌ తీర్పు ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106ఎకరాలను సేకరించి ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర జలవనరుల కమిషన్‌ ఆధ్వర్యంలో ఎపి,ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా సర్వే నిర్వ హించి నివేదిక సమర్పించాలని ట్రిబ్యునల్‌ సూచించింది. దీనిపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితేనే 19 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒడిశాకూ ప్రయోజనం కలగనుంది. ఆధ్రా`ఒడిశా సరిహద్దులోని విజయనగరం జిల్లా జంరaావతి సాగునీటి ప్రాజెక్టు, కొఠియా గ్రామాలపై వివాదం నెలకొంది. జంరaావతి ప్రాజెక్టు రబ్బరు డ్యాముకే పరిమితం అయింది. దీంతో, నాలుగు వేల ఎకరాలకు మించి నీరు అందడం లేదు. ఈ వివాదం పరిష్కారమైతే 24,640 ఎకరాలకు సాగునీరు అందనుంది. మొత్తంగా చర్చలకు ఎప్పుడూ ఫలితం ఉంటుందని గ్రహించాలి.