‘పుష్ప’ మూవీలో అనసూయ ఫస్ట్ లుక్ విడుదల..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ’పుష్ప’. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ’పుష్ప ది రైజ్ పార్ట్ 1’ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమలోనే తాజాగా ఇందులో దాక్షాయణిగా నటిస్తున్న అనసూయ పాత్రను పరిచయం చేశారు. ’రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో.. నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
’అల వైకుఠపురంలో’ లాంటి ఇండస్టీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. ’రంగస్థలం’ లాంటి ఇండస్టీ హిట్ తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ’పుష్ప’ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ’ఆర్య’, ’ఆర్య 2’ సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా ’పుష్ప’ సినిమా వస్తుంది. ఇక సుకుమార్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం ’పుష్ప ది రైజ్ పార్ట్ 1’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి విూడియాతో కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సునీల్ మగళం శ్రీను అనే మరో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.