బాలీవుడ్‌లో నాకెందుకు ఆ ఛాన్స్‌ రాలేదు..? పాయల్‌

బాలీవుడ్‌లో నాకెందుకు ఆ ఛాన్స్‌ రాలేదు..? అని తెగ ఫీలైపోతోంది పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. తెలుగులో వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించిన సినిమా ’ఆర్‌.ఎక్స్‌ 100’. ఈ సినిమాతో ఓవర్‌ నైట్‌ కార్తికేయ `

పాయల్‌ రాజ్‌పుత్‌ స్టార్స్‌ హీరో, హీరోయిన్లు అయ్యారు. దర్శకుడిగా అజయ్‌ భూపతికీ మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ వల్లే వెంకటేశ్‌ సరసన ’వెంకీ మామ’, రవితేజ సరన ’డిస్కోరాజా’ లాంటి సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఆమె యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌ సరసన ఓ సినిమా చేస్తోంది. అయితే, ఇప్పుడు ’ఆర్‌.ఎక్స్‌ 100’ మూవీ హిందీలో రీమేక్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ తారా సుతారియా హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ’తడప్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా సునీల్‌ శెట్టి కొడుకు అహన్‌ శెట్టి హీరోగా బాలీవుడ్‌ ఇండస్టీక్రి పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా తనకు ఎందుకు అవకాశం రాలేదోనని ఇప్పుడు పాయల్‌ ఫీలవుతుందట. ఇటీవల నెటిజన్స్‌తో పాయల్‌ ఈ విషయాన్ని షేర్‌ చేసుకుంది. మొత్తానికి హిందీ ఇండస్టీ విూద తనకి ఆసక్తి ఉన్న విషయాన్ని ఈ రకంగా బయటపెట్టింది. చూడాలి మరి పాయల్‌ ఆసక్తిని గమనించి ఎవరైనా బాలీవుడ్‌లో అవకాశాలిస్తారేమో.