ప్రియమైన ఆభరణం ఎంగేజ్‌మెంట్ రింగ్.. ప్రియాంక చోప్రా

బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్ కంటే గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జోడీనే. 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ రింగ్ సెంటిమెంట్ గురించి ప్రియాంక చోప్రా జోనాస్ చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్ చంపేస్తాడు అంటూ చమత్కరించింది.
ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్‌మెంట్ రింగ్ తనకు అత్యంత ప్రియమైన ఆభరణమని వెల్లడిరచింది. వాస్తవానికి తనజ్యుయల్లరీ ప్రతీదానికిఒక సెంటిమెంట్ ఉంటుందని అందుకేప్రతీదాన్ని అపురూపంగా చూసుకుంటానని తెలిపింది. ముఖ్యంగా తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మక మైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్ ఉందని వెల్లడిరచింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల రూపాయల ఈ డైమండ్ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్ ఉందంటూ బ్యాక్‌స్టోరీని వివరించింది.