టి20 భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ

టి20 భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం బీసీసీఐ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కివీస్‌తో మొదట మూడు టి20లు ఆడనున్న టీమిండియా తర్వాత రెండు టెస్టులు ఆడనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ బుధవారం టి20, టెస్టు జట్టును ప్రకటించనుంది. ఈ విషయం పక్కనబెడితే.. విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆడే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా.. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానేకే తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.