‘లడ్డుండ’ పాటతో వచ్చిన బంగార్రాజు

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సరి కొత్త ఎనర్జీతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. సొగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వేల్‌గా నాగ్ ’బంగార్రాజు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్‌ను విడుదల చేశారు. లడ్డూండ పాటను హీరో నాగార్జున విడుదల చేశారు. ఎంతో ఎనర్జీగా సాగే ఈ పాటను ధనుంజయ, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్ మోహన్ పాడారు. ’అబ్బాయ్ హార్మోనీ.. డంటకు డడనా’ అంటూ పాటకు ముందు వచ్చే సాకీని నాగార్జున హుషారెత్తించేలా ఆలపించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. దీనికి సంబంధించిన వీడియోని నాగచైతన్య షేర్ చేస్తూ.. ‘నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు‘ అని ట్వీట్ చేశారు.
ఇక ’బంగార్రాజు’ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా కీ రోల్‌లో నటిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి కనిపించనున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.