’భోళాశంకర్‌’లో చిరుకు జోడీగా తమన్నా!

చిరుకు జోడీగా తమన్నా!

మెగాస్టార్‌ చిరంజీవి, మెహర్‌ రమేశ్‌ కలయికలో రాబోతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’భోళాశంకర్‌’. తమిళంలో సూపర్‌ హిª`టటైన అజిత్‌ ’వేదాళం’ చిత్రానికిది అఫీషియల్‌ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. సిస్టర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో కలకత్తా బ్యాక్‌ డ్రాప్‌ లో జరిగిన కథగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో లాంఛ్‌ చేయబోతున్నారు. కాగా.. ఈ నెల 15నుంచి సినిమా రెగ్యులర్‌ షూట్‌ కు వెళ్ళబోతోంది. ఇందులో చిరంజీవి చెª`లలెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తుండగా.. చిరు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను అధికారికంగా ఖాయం చేస్తూ.. ట్విట్టర్‌ వేదిక గా ప్రకటించారు మేకర్స్‌. దాన్ని గౌరవంగా భావిస్తూ తమన్నా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తమన్నా ఇంతకు ముందు చిరు ’సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఆమెది ఓ ప్రత్యేక పాత్ర మాత్రమే. అందులో చిరుతో ఆమె ఇంటరాక్షన్‌ కూడా కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యాయి. అందుకే ’భోళాశంకర్‌’ లో చిరంజీవి సరసన కథానాయికగా వచ్చిన ఆఫర్‌ ను కాదనకుండా అంగీకరించారు తమ్మూ. ఈ సినిమా కోసం తమన్నా భారీగా పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. మంచి డ్యాన్సర్‌ అయిన తమన్నా..  కింగ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అయిన చిరును ఏమేరకు మ్యాచ్‌ చేస్తారు అనే ఆసక్తితో ఉన్నారు అభిమానులు. మరి ’భోళాశంకర్‌’ కు తమన్నా గ్లామర్‌ అపీరెన్స్‌ ఏ రేంజ్‌ లో హైలైట్‌ అవుతుందో చూడాలి.