రవితేజ తనయుడితో హరీష్‌ శంకర్‌.. మూవీ?

మాస్‌ మహరాజా రవితేజ కొన్నాళ్లుగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ బిజీలో ఆయన ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడో లేదో తెలియడం లేదు. రవితేజ నటించిన ఖిలాడీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇక సెట్స్‌ పై రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా, టైగర్‌ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాలు ఉన్నాయి.క్రాక్‌ వంటి హిట్‌ తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఒకవైపు తను ఒప్పుకున్న సినిమాలు చేస్తూనే మరోవైపు కుమారుడి భవిష్యత్‌ గురించి రవితేజ ఆలోచిస్తున్నాడట. రవితేజ తన తనయుడు మహాధన్‌ని సినిమాల్లోకి తీసుకురావాలని కృషి చేస్తున్నాడట. కొన్నాళ్ళ క్రితం వరకు కుటుంబ సభ్యులను పెద్దగా పట్టించుకోకుండా, తన కుటుంబం విూడియా ముందుకు రావొద్దని కోరుకున్న రవితేజ ఇప్పుడు తన కొడుకు సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడనే టాక్‌ వినిపిస్తుంది.

తాజాగా హరీష్‌ శంకర్‌.. రవితేజ తనయుడు మహాధన్‌ కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ విూడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాధన్‌ తొలి సినిమా హరీష్‌ శంకర్‌ డైరెక్ట్‌ చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే మహాధన్‌ వయస్సు ఉన్న ఆకాశ్‌ పూరీ, రోషన్‌ ఇండస్టీల్రో రాణిస్తున్న విషయం తెలిసిందే.