అదిరిపోయిన ‘అఖండ’ టైటిల్ సాంగ్

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సింహ, లెజెండ్లతో నట సింహం బాలయ్య కెరీర్లో మైల్ స్టోన్స్‌లాంటి సినిమాలను అందించిన బోయపాటి ఇప్పుడు అఖండగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపిస్తున్నందున ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనివుంది.
దీపావళి కానుకగా అఖండ టైటిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. భం అఖండ, భంభం అఖండ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొద్ది సేపటి క్రితం ఫుల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ పూనకాలు తెప్పిస్తుంది. మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాను ద్వారక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ విూద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు. క్రాక్ డైరక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.