ఆకట్టుకుంటోన్న ’డేగల బాబ్జీ’ ట్రైలర్

బండ్ల గణెళిశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న డిఫరెంట్ మూవీ ’డేగల బాబ్జీ’. తమిళంలో సూపర్ హిట్టవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ’ఒత్త సెరుప్పు సైజ్ 7’ సినిమాకిది రీమేక్ వెర్షన్. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. సినిమా మొత్తం విూద ఒకే ఒక పాత్ర ఉంటుంది. అందులోనూ సింగిల్ లొకేషన్ లోనే కథంతా నడుస్తుంది. ఇందులో పార్తీబన్ హీరోగా నటించడమే కాకుండా.. ఈ సినిమాకి ఆయన దర్శకత్వం కూడా వహించారు. అలాంటి ఈ సినిమా తెలుగు వెర్షన్ లో బండ్ల గణెళిశ్ తనదైన శైలిలో నటిస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకి తన డబ్బింగ్ ను పూర్తి చేశారు బండ్ల గణెళిశ్ . త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఒక హత్యకేసులో ప్రధాన నిందితుడైన డేగల బాబ్జీ .. అసలు ఆ హత్యను తానెందుకు చేయాల్సి వచ్చిందో వివరించడం.. ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ ట్రైలర్ లో బండ్ల గణెళిశ్ డైలాగ్స్, ఎమోషన్స్, హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ’పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తునే ఉన్నాం’.. ’అసలు అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా’ అంటూ ఆయన పలికే డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. యశ్రిషి ఫిల్మ్స్ పతాకంపై స్వాతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సింగిల్ లొకేషన్ లో ఒక్క పాత్రతో బండ్ల గణెళిశ్ ఈ సినిమాని ఏ రీతిలో హ్యాండిల్ చేశారో తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.