పవన్‌కు జోడీగా పూజాహెగ్డే

ప్రస్తుతం సౌత్‌ ఇండస్టీస్ర్‌ తో పాటు బాలీవుడ్‌ లోనూ పూజాహెగ్డే మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. ముచ్చటగా మూడు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుకుంటున్నారు. ప్రభాస్‌ ’రాధేశ్యామ్‌’, తమిళ హీరో విజయ్‌ ’బీస్ట్‌’, మహేశ్‌ ` త్రివిక్రమ్‌ మూవీస్‌ తో పాటు సల్మాన్‌ ఖాన్‌ సరసన ఓ హిందీ మూవీకి కూడా సైన్‌ చేశారు. వీటితో పాటు పూజా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ లో కథానాయికగా నటించనుండడం టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ అయింది. పవర్‌ స్టార్‌, హరీశ్‌ శంకర్‌ కాంబో మూవీ ’భవదీయుడు భగత్‌ సింగ్‌’ లో కథానాయికగా పూజాని ఎంపిక చేశారు.

పవర్‌ స్టార్‌, పూజాహెగ్డే జోడీగా నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ ఇంతవరకూ అది వర్కవుట్‌ కాలేదు. ఇటీవల హరీశ్‌ శంకర్‌ ఒక సినిమా ఫంక్షన్‌ లో ఈ ఇద్దరి జోడీని ఫిక్స్‌ చేసినట్టు ప్రకటించి అభిమానుల్ని ఖుషీ చేశారు. ’గద్దలకొండ గణెళిశ్‌’ లో పూజా హెగ్డే ని కథానాయికగా తీసుకున్న హరీశ్‌.. పవర్‌ స్టార్‌ హీరోగా తను తెరకెక్కించబోతున్న ’భవదీయుడు భగత్‌ సింగ్‌’ లో ఆమె ను కథానాయికగా ప్రకటించారు. పూజాహెగ్డే కూడా పవన్‌ సరసన నటించడానికి అంగీకారం తెలిపారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. హరీశ్‌ శంకర్‌ నుంచి పూజాహెగ్డే కి అఫీషియల్‌ కన్ఫర్మేషన్‌ వస్తే కాల్షీట్స్‌ ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం.