ఆర్యన్‌ ఖాన్‌ చేతిలో అలనాటి సినిమా నవలా పుస్తకం

క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ’టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌’గా నిలిచిన ఆర్యన్‌ ఖాన్‌.. ఇటీవల నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ సహా పలువురికి బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి శుక్రవారం నాడు ఎన్సీబీ విచారణకు హాజవర్వాలని ఆర్యన్‌కు ఒక షరతు విధించింది. ఈ క్రమంలో తొలిసారి ఎన్సీబీ విచారణకు హాజరైన ఆర్యన్‌ ఖాన్‌ వద్ద ఉన్న ఒక పుస్తకం అందరి దృషినీ ఆకర్షించింది. అదే ’ఎ గర్ల్‌ విత్‌ ది డ్రాగన్‌ టాటూ’ పుస్తకం. నలభై ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఒక మహిళ కోసం ఒక యువతి వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక జర్నలిస్టు సాయం తీసుకుంటుంది. అయితే ఈ కథ ఎన్నో మలుపులు తిరిగి చివరకు ఆ కనిపించకుండా పోయిన మహిళకు ఏమైంది? అసలు ఆమె కోసం సదరు యువతి ఎందుకు వెతుకుతోంది?

అనే అంశాలను రచయిత స్టీగ్‌ లార్సన్‌ ఈ పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా చెప్పారు. ఈ పుస్తకం ఆధారంగా స్పానిష్‌ భాషలో ఒక సినిమా రూపొందింది. దాన్ని ప్రఖ్యాత హాలీవుడ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ ఫించర్‌ రీమేక్‌ చేశాడు. ఈ చిత్రంలో ’జేమ్స్‌బాండ్‌’గా అలరించిన డేనియల్‌ క్రెయిగ్‌ కీరోల్‌లో నటించాడు.