పుష్ప రిలీజ్‌కు హిందీ కష్టాలు

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ప్రస్తుతం ’పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. డిసెంబర్‌లో  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పుష్ప మూవీని సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీగా రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్‌ గా రిలీజ్‌? అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్‌ రిలీజ్‌ కు ఇబ్బందులు ఎదుర్కొంటోందని సమాచారం.పుష్ప సినిమాని పాన్‌ ఇండియా చిత్రంగా అనుకోకముందు తెలుగు,మళయాళంలో రిలీజ్‌ చేద్దామని ’పుష్ప’ హిందీ డబ్బింగ్‌ హక్కుల్ని అమ్మేసారట. పాన్‌ ఇండియా సినిమా అయిన తరువాత హిందీ హక్కులు కొనుక్కున్న వ్యక్తి థియేటర్లలో విడుదలకు అంగీకరించడం లేదు. పబ్లిసిటీ, థియేటర్‌ ఖర్చులు మైత్రీ మూవీస్‌ నే పెట్టుకుని, పర్సంటేజ్‌ ఇస్తే థియేటర్‌ విడుదలకు అంగీకరిస్తానని అంటున్నారట. ఇలా చేస్తూ మైత్రిమూవీస్‌కి నష్టంగా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్‌ ద్వారా ఈ సమస్యని సాల్వ్‌ చేద్దామని చూసినా కాలేదట. దీంతో పుష్ప చిత్రం హిందీలో విడుదల కావడం కష్టమేనని, ఈ సినిమాతో ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెడదామనుకున్న కల కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల విడుదలైన సామి సామి సాంగ్‌ హిందీలో విడుదల కాకపోవడంతో పుష్ప హిందీలో రిలీజ్‌ కావడం కష్టమేనంటున్నారు