జయమ్మగా బుల్లితెర సుమ

వేదిక ఏదైన తన మాటలతో గారడి చేసే బుల్లితెర యాంకర్‌ సుమ. టెవిలిజన్‌ కార్యక్రమాలు, సినిమా వేడుకలు.. ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది. ’కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన సుమ మళ్లీ 8 ఏళ్ల తర్వాత సినిమాలు చేయాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రంకు సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. సుమ రీఎంట్రీ మూవీకి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశాడు. చిత్రానికి జయమ్మ పంచాయతీ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయగా, ఇందులో సుమచాలా సీరియస్‌ లుక్‌లో ఊరి బాధ్యతలను మోసే

యువతిగా కనిపిస్తుంది. విజయ్‌ కుమార్‌ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేయనున్నటటు తెలుస్తుంది. సుమ గతంలో ’పవిత్ర ప్రేమ’, ’చాలా బాగుంది’, ’వర్షం’, ’ఢీ’, ’బాద్‌షా’ తదితర చిత్రాల్లో నటించారు. సుమారు 8 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.