Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

154వ సినిమాలో చిరు ఊరమాస్‌ లుక్‌

చిరు 154వ సినిమాకు పూజ

ఊరమాస్‌ లుక్‌లో అదుర్స్‌ అంటున్న అభిమానులు

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ’ఆచార్య’ షూటింగ్‌? ఇప్పటికే పూర్తి చేసిన చిరు.. ’గాడ్‌ఫాదర్‌’, ’భోళా శంకర్‌’ చిత్రాల షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్‌  మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌ లో జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి మాస్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తారు. ఇందులో చిరంజీవి లైటర్‌ వెలిగించి సిగరెట్‌ కాలుస్తున్నట్టు కనిపించారు. ఈ పోస్టర్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ’వాల్తేరు వీరయ్య’ టైటిల్‌  పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బ్జడెట్‌తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. మెగా అభిమానులు అన్నయ్య మెగాస్టార్‌ను ఊర మాస్‌ లుక్‌లో చూసి ఎన్నేళ్ళు అయిందో. ఇప్పుడు వారికి ఆ ఆరాటం తీర్చబోతున్నారు దర్శకుడు బాబీ. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు. ఇది మెగాస్టార్‌ కెరీర్‌లో 154వ సినిమా. ప్రస్తుతం మెగా 154 వర్కింగ్‌ టైటిల్‌గా చెప్పుకుంటున్న ఈ మూవీలోని మెగాస్టార్‌ మాస్‌ లుక్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ఈ లుక్‌ చూస్తుంటే చిరును  25 ఏళ్ళ క్రితం ’ముఠా మేస్త్రి’, ’గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలలో చూసినట్టుంది. అని అభిమానులు చెప్పుకుంటున్నారు. తాజాగా వదిలిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో గడ్డం, కళ్ళకు గాగూల్స్‌ పెట్టుకొని..నోట్లో ఉన్న బీడీని లైటర్‌తో వెలిగిస్తు.. చాలా స్టైల్‌గా కనిపిస్తున్నారు మెగాస్టార్‌. అలాగే చేతికి బ్రాస్లెట్‌, మెడలో చైన్‌ హైలెట్‌ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మెగాస్టార్‌ను ఎంత మాస్‌గా చూపించబోతున్నారో అర్థమవుతోంది. ఇక డైరెక్టర్‌ బాబీ చిరు ఫస్ట్‌ను సోషల్‌ విూడియా ద్వారా షేర్‌ చేస్తూ ’అన్నయ్య అరాచకం ఆరంభం’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం మెగా 154 ఫస్ట్‌ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.  మెగాస్టార్‌తో తన సినిమా లాంచ్‌ అయిన నేపథ్యంలో బాబీ చేసిన ట్వీట్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘మెగాస్టార్‌, ఆయన పేరు వింటే?అంతు లేని ఉత్సాహం ! ఆయన పోస్టర్‌ చూస్తే..అర్ధం కాని ఆరాటం.. తెర విూద ఆయన కనబడితే?ఒళ్ళు తెలీని పూనకం, ప్దదెనిమిదేళ్ల క్రితం?.ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల  నిజమవుతున్న ఈ వేళ విూ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.‘ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.