Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెట్రోల్‌ ధరలూ మరింత తగ్గించే యోచనలో కేంద్రం?

ఎక్సైజ్‌ టాక్స్‌ తగ్గించి వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. అయితే ఇంకా పెట్రో ధరలను తగ్గించాలని భావిస్తోంది. ఇంధన ధరలను మరింత తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం చూస్తే.. లీటరు పెట్రోల్‌ రూ.60కే లభించే అవకాశం ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కోసం ఇథనాల్‌ బ్లెండిరగ్‌ను పెంచాలని చూస్తోంది. దేశంలో ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ తీసుకురావాలని భావిస్తోంది.

పెట్రోల్‌ ధర రూ.60కు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలు కూడా ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ ఇంజిన్లన తయారు చేయాల్సి ఉంటుంది. వీటి తయారికి ఎలక్ట్రిక్‌ వాహనాల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఇంజిన్లను ఇథనాల్‌, మిథనాల్‌, గ్యాసోలిన్‌ వంటి మిక్సింగ్‌ చేసిన ఫ్యూయెల్స్‌ కూడా ఉపయోగించొచ్చు. ఇదే జరిగితే త్వరలో పెట్రోల్‌ ధర రూ.60 దిగి వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం పెట్రో ధరలను ఒకసారి పరిశీలిస్తే ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.97గా ఉండగా లీటర్‌ డీజిల్‌ రూ.86.67గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.101.40గా ఉండగా డీజిల్‌ రూ. 91.43గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.104.67గా ఉండగా డీజిల్‌ రూ. 89.67గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.109.67గా ఉండగా డీజిల్‌ రూ. 94.14గా ఉంది. ఉత్తర ప్రదేశ్‌ లక్నోలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.28 ఉండగా డీజిల్‌ ధర రూ. 86.80గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.20గా ఉండగా లీటర్‌ డీజిల్‌ రూ.94.62గా ఉంది. ఇక జిల్లాలకు వెళితే కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.49గా ఉండగా లీటర్‌ డీజిల్‌ రూ.94.88గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.96గా ఉండగా లీటర్‌ డీజిల్‌ రూ.96.98గా ఉంది. విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.05 ఉండగా లీటర్‌ డీజిల్‌ రూ.95.18గా ఉంది పెట్రోల్‌, డీజీల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర తగ్గించడంతో లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గుతుంది. దేశంలో ఇంధర ధరలు అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం.. దానికి తోడు కట్టడి చేయలేని స్థితికి ద్రవ్యోల్బణం చేరుకున్నాయి. వీటికి తోడు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీని ఎప్పుడో దాటేశాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర అయితే ఏకంగా 120 దాటేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీంతో మెట్టు దిగి వచ్చి ఎక్సైజ్‌ డ్యూటీలో కోత విధించుకుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.