షమీ టీ20లకు పనికిరాడు…సంజయ్‌ మంజ్రేకర్‌

సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వాఖ్యలు

ప్రపంచకప్‌-2021లో భాగంగా శుక్రవారం (నవంబర్‌5) టీమిండియా కీలక మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌తో తలపడనుంది. ఈ సందర్బంగా భారత బౌలర్లపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. టీ20లకు కాకుండా ఇతర ఫార్మాట్‌లకు సరిపోయే ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అతడు సూచించాడు. దీనికి ఉదాహరణగా మహ్మద్‌ షమీని అతడు పేర్కొన్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో షమీ ఒక ఆద్బుతమైన పేసర్‌, అయితే పొట్టి ఫార్మాట్‌లో అతని కంటే మెరుగైన ఆటగాళ్ళు ఉన్నారని మంజ్రేకర్‌ చేప్పాడు. ‘‘భారత్‌ టీ20 జట్టులో మార్పులు చేయవలిసిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత జట్టులో కొంతమంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌లో కాకుండా, ఇతర ఫార్మాట్‌లో ఆడేందుకు బాగా సరిపోతారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. నేను మహ్మద్‌ షమీ గురించి మాట్లాడుతున్నాను. నా దృష్టిలో షమీ భారత క్రికెట్‌ కు గొప్ప ఆస్తి. మంచి నాణ్యమైన బౌలర్‌ కూడా. అయితే అది టెస్టు మ్యాచ్‌ ల వరకే పరిమితం. టీ20లలో అతడి ఎకానమీ 9 కి చేరింది. అతడు ఆఫ్ఘనిస్తాన్‌పై బాగా బౌలింగ్‌ చేశాడని నాకు తెలుసు. అయితే టీ20 క్రికెట్‌లో మహ్మద్‌ షమీ కంటే మెరుగైన బౌలర్లు భారత్‌లో ఉన్నారు అని అతడు పేర్కొన్నాడు.