Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చరణ్‌తో ట్రైన్‌ యాక్షన్‌ సన్నివేశాలు

ప్రత్యేక వ్రద్ద తీసుకున్న డైరెక్టర్‌ శంకర్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మేకింగ్‌ కింగ్‌ శంకర్‌ దర్వకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం .. రీసెంట్‌ గా మొదటి షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎత్తయిన కొండలపై యూనిట్‌ హెలీకేప్టర్స్‌ తో ల్యాండ్‌ అయి.. అక్కడ షూట్‌ చేశారు. చెర్రీపై ఇక్కడ భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారని తెలుస్తోంది. అంతేకాదు.. ఇదే షెడ్యూల్‌ లో ఓ భారీ ట్రైన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ను కూడా చిత్రీకరించినట్టు సమాచారం. ఈ ట్రైన్‌ ఎపిసోడ్‌ గురించి ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి.  రైల్వే ట్రాక్‌ పై శంకర్‌ రివీలైన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. దాంతో ఈ షెడ్యూల్‌ లో శంకర్‌ చిత్రీకరించింది ట్రైన్‌ ఎపిసోడ్‌ నే అర్ధం అవుతోంది. ఈ ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్‌ అంటున్నారు. ’కేజీఎఫ్‌’ మూవీకి పనిచేసిన స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ అన్బురవి ఈ యాక్షన్‌ సీన్‌ ను డిజైన్‌ చేశారని అంటున్నారు. గతంలో శంకర్‌ ’జెంటిల్‌ మేన్‌, రోబో, అపరిచితుడు’ లాంటి సినిమాల్లో ట్రైన్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించి ఆ సినిమాలకే హైలైట్స్‌ గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఖీఅ15 కోసం దాన్ని రిపీట్‌ చేస్తుండడం ఆసక్తిగా మారింది. ఐఏయస్‌ ఆఫీసర్‌ గా రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈసినిమాలో కథానాయికగా కియారా అద్వానీ, ముఖ్యపాత్రల్లో సునీల్‌, జయరాం, విలన్‌ గా సురేశ్‌ గోపీ నటించబోతున్నారు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ లో దాదాపు రూ. 170కోట్లతో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకి ’విశ్వంభర’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరి ఇందులోని ట్రైన్‌ యాక్షన్‌ అభిమానుల్ని ఏ రేంజ్‌ లో అలరిస్తుందో చూడాలి.