Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆచార్యలో ట్రెండి౦గ్‌ మారిన నీలాంబరి పాట

-మణిశర్మ సంగీతానికి ఫిధా అయిన‌ చిరు

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రంలోని ’నీలాంబరి పాటను శుక్రవారం విడుదల చేశారు. మణిశర్మ సంగీత సారథ్యంలో రామ్‌చరణ్‌, పూజాహెగ్డేలపై సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్‌ విూడియాలో ట్రెండిరగ్‌లో ఉంది. తాజాగా ఈ పాట గురించి మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని మరో సారి రుజువు చేసిన నీలంబరి అని చిరంజీవి మణిశర్మను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో చరణ్‌ సిద్థ అనే నక్సలైట్‌గా దర్శనమివ్వనున్నారు. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజాహెగ్డే కనిపించనుంది. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్‌ చేసిన పోరు నేపథ్యంలో సాగే సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.  కొణిదెల ప్రొడక్షన్స్‌ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.