భర్తతో కలిసి లక్ష్మీపూజ చేసిన ప్రియాంకా చోప్రా

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి అక్కణ్నుంచి హాలీవుడ్ బాట పట్టింది ప్రియాంకా చోప్రా. హాలీవుడ్ నటుడు, గాయకుడు నికో జోనాస్‌ను వివాహం చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోయింది. అయినప్పటికీ భారతీయ సాంప్రదాయాలను మర్చిపోకుండా పాటిస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా భర్తతో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో లక్ష్మీపూజ చేసింది. నికో జోనాస్, ప్రియాంక సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు ప్రియాంక దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సాంప్రదాయాలను మర్చిపోలేదని ప్రశంసిస్తున్నారు. ఇద్దరూ అద్భుతంగా ఉన్నారని, ప్రియాంక లాంటి వారే భారత్‌కు నిజమైన అంబాసిడర్‌లని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రియాంకను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఒక వ్యక్తి పేర్కొన్నారు.