Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్తీక మాసంతో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

నదుల్లో పుణ్యస్నానాలు ఆచరణ

కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యాన్ని ఉంది. కార్తీక తొలిరోజు శుక్రవారం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో కార్తీకశోభతో ఆలయాలు కిటకిటలాడాయి. సముద్రస్నానాలు, నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాలు భక్తులతో అలరారాయి. కార్తీకమాసంలో ఉపవాసం చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు పేర్కొన్నారు. సృష్టికి లయకారుడైన పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం ఎన్నో విశిష్టతల వేదిక. ఉపవాసం చేయలేని.. వారు ఈ ఒక్క రోజు ఆచరిస్తే చాలన్న సూచనతో ఉపవాస దీక్షలకుప్రాధాన్యం పెరిగింది. ఈ రోజున ఉపవాసం చేసిన వారికి సదాశివుడు మోక్షధామం ప్రసాదిస్తాడని, పునర్జన్మ లేకుండా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్న వేదోక్తంకారణంగా పలువురు ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్టాల్ల్రో  శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు నదీ తీర ప్రాంతాల్లో ఉన్న శివాలయాల్లో రద్దీ నెలకొంది. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తిలతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగింది.  తెల్లవారుజాము నుంచే నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. రాజమండ్రి వద్ద గోదావరి స్నానాలతో గోదావరి పులకరించింది. తెలంగాణ ªూష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, కీసర, కాళేశ్వర, జోగులాంబ,  వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. శివనామస్మరణ లతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రామాలయంలో దర్శనం చేసుకున్నారు. బాసర,ధర్మపురి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. ఆలయాల్లో కార్తీక పూజలు చేశారు. యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతాలు విరివిగా చేపట్టారు.