Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేశవిదేశాల్లో దీపావళి వేడుకలకు  ప్రాధాన్యం

విభిన్న రీతులుగా దీపావళి  వేడుకలు

సంస్కృతి,సంప్రదాయాలకు పెద్దపీట

దీపాల పండుగ దీపావళిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకంగా చేసుకోవడం కూడా ఆనావాయితీగా వస్తోంది.  ఆ వైభవం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వివిధ దేశాల్లో దీపావళి ప్రత్యేకంగా నిర్వహించడం చేస్తున్నారు. దీపావళి ఒక్క భారత దేశంలోనే కాదు భారతసంతతి ఉన్న ప్రతీ చోట వైభవంగా జరుగుతుంది. ఈ పండుగను జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపు కుంటారు.

ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల మందికి పైగా ప్రజలు దీపావాళిని వివిధ రీతుల్లో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. విదేశాల్లోనూ పర్వదినాన్ని ఘనంగా చేస్తుంటారు. దీపావళిని మనదేశంలోనే వివిధ రాష్టాల్ల్రో వివిధరకాలుగా జరుపుకుంటారు. విదేశాల్లో కూడా ఈ పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. భారతీయులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. అక్కడికి వెళ్లాక మన సంస్కృతి, సంప్రదాయా లనే కొనసాగిస్తున్నారు. హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది భారతీయులు ఉండటంతో కొన్ని దేశాలు దీపావళిని జాతీయ పండుగగా ప్రకటించాయి.  కొన్ని ప్రభుత్వాలు దీపావళిని జాతీయ పండుగగా ప్రకటించాయి. ఆ జాబితాలో మారిషస్‌, నేపాల్‌, మలేసియా, ఇండోనేసియా,  మయన్మార్‌, సింగపూర్‌, శ్రీలంక, జపాన్‌, థాయ్‌లాండ్‌, దక్షిణాఫ్రికా, కెన్యా, టాంజానియా, బ్రిటన్‌, ఆస్టేల్రియా, ఫిజీ తదితర దేశాలు ఉన్నాయి. మన పక్కనే ఉన్న హిందూ దేశం నేపాల్‌లో దీని ప్రత్యేకత వేరు. నేపాల్‌లో దీపావళిని తీహార్‌గా పిలుస్తారు.

భారత్‌తో పోలిస్తే ఈ దేశంలో పండుగ విభిన్నంగా జరుగుతుంది. ఇక్కడ లక్ష్మిని పూజిస్తారు. పండుగ అయిదు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు ఆవులకు.. రెండో రోజు  శునకాలకు ఆహారం అందిస్తారు. ఇలా ఒక్కో రోజును ఒక్కో జంతువుకు కేటాయిస్తారు. దీపావళికి అమెరికా సహా పలు దేశాల్లో సెలవులు ప్రకటించారు. జీవితాల్లో చీకటిని పారదోలి వెలుగుల్ని తీసుకొస్తుందని భావించే దీపావళిని ఇతర రాష్టాల్రు  దేశాల్లో వివిధ వర్గాలు చేసుకుంటాయి.  ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల దీపావళి మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మూడో రోజును ’బలి ప్రతిపాద’గా వ్యవహరిస్తుంటారు. పురాణాల ప్రకారం ఒకరోజు బలి చక్రవర్తి భక్తిని మెచ్చిన విష్ణు.. అతనికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే వరం ఇచ్చాడు. అదే రోజును ఉత్తర భారతీయులు ’బలి ప్రతిపాద’గా చేసుకుంటారు.  పశ్చిమ బంగలో… దీపావళిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటిని కాళీ పూజ.. శ్యామ పూజ.. మహనిష పూజలుగా పిలుస్తారు. కాళీమాతకు స్వాగతం చెబుతూ వీటిని నిర్వహిస్తారు. ఈ రోజుల్లో వీధులు, ఇళ్లు, కార్యాలయాలు వెలుగుల్ని విరబూయిస్తాయి. అందరూ బాణసంచా పేలుస్తారు. కొన్ని చోట్ల మాత్రం ఉపవాసం ఉండి లక్ష్మిని పూజిస్తారు. హౌరా, మిద్నాపూర్‌, హుగ్లీ తదితర జిల్లాలోని గ్రావిూణ ప్రాంతాల్లో అగాంబాగీష్‌ పేరిట ప్రత్యేక పూజలు చేస్తారు.

దీనిపక్కనే ఉన్న ఒడిశాలో పండుగను కాస్త విభిన్నంగా జరుపుకొంటారు.. ’కౌరీయా కతీ’ పేరిట ప్రత్యేక పూజలు చేస్తారు. జనపనార కర్రలను ఇళ్ల ముందు కాలుస్తారు. ఇలా చేస్తే స్వర్గంలో ఉన్న తమ పూర్వీకులు కిందికు దిగి, ఇంట్లోకి వస్తారని భావిస్తారు. అలా వచ్చి తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. మిత్రులతో వీలైనంత ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. 19వ శతాబ్దంలో 1.43 లక్షల మంది ఒడిశా, బిహార్‌ తదితర రాష్టాల్రకు చెందిన భారతీయులు చెరకు తోటల్లో పని చేసేందుకు ట్రినిడాడ్‌ దేశానికి వలస వెళ్లారు. వారంతా అక్కడే స్థిర పడి… భారతీయ సంస్కృతినే కొనసాగిస్తున్నారు. ట్రినిడాడ్‌ ప్రభుత్వం దీపావళిని జాతీయ సెలవు దినంగా 1966లో ప్రకటించింది. ఇక్కడ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవోపేతంగా చేస్తారు.

గుజరాతీయులు దీపావళి రోజున కొత్త వ్యాపారం, వెంచర్‌, లెడ్జర్‌లను ప్రారంభించేందుకు ’చోప్డా పూజ’ను నిర్వహిస్తారు. గృహిణులు ఇళ్లలో లక్ష్మి పూజ చేస్తారు. పండుగకు ముందు రోజే ’ఉరాద్‌ దాల్‌’ వడలను సిద్ధం చేస్తారు. పండుగ రోజు అయిదు ఉరాద్‌ దాల్‌ వడలను ఎండిన ఆవు పేడపై ఉంచుతారు. దాన్ని ఇంటి ప్రవేశించే ప్రధాన ద్వారం దగ్గర కాలుస్తారు. మహారాష్ట్రలో… మనలాగే మహారాష్ట్రలోనూ చేసుకుంటారు. కాకపోతే.. ఆ రోజు రకరకాల మిఠాయిలు సిద్ధం చేస్తారు. వాటిని ’దీపావళి స్నాక్స్‌’గా అందరికీ పంచుతారు. ఇందులో కారంజీ, లడ్డూ, శంకర్‌పాలె, చకల్లీ, సేవ్‌, చవిదా తదితరాలు ఉంటాయి. సింధీలు పండుగ చేసుకునే విధానం వైవిధ్యంగా ఉంటుంది. ’దియారీ’ పేరిట ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారిని పూజించే ముందు ఇంట్లో ఉన్న బంగారు, వెండి నాణెళిలను పాలతో కడుగుతారు. అనంతరం వాటిని పూజలో ఉంచుతారు. పూజ ముగిశాక ఆ నాణెళిలను పళ్ల మధ్యలో ఉంచుకుని ’లక్ష్మి ఆయి.. దంతీ వాయి’ అంటూ జపిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మి కరుణిస్తుందని వారి నమ్మకం.