Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దివ్యకాంతుల వెలుగుల  దీపావళి

అమావాస్య చీకట్లను తొలగిస్తూ వెలుగుదదివ్వెలు

నరకుడిని వధించినందున నరకచతుర్దశి

రాముడు అరణ్యవసాం వీడాడన్నది ఉత్తరాది వారి నమ్మకం

అమావాస్య రోజున వచ్చే ఏకైక అతిపెద్ద పండగ దీపావళి. నరకుడిని వధించిన సందర్భంగా జరుపుకునే పండగే దీపావళిగా ప్రసిద్ది చెందింది. నరకాసుర సంహారం జరిగిన ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు శ్రీకృష్ణుడి విజయానికి సంకేతంగా ప్రజలు దీపాలు వెలిగించి ఈ పండగ చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే రాముడు అరణ్యవాసం నుంచి వచ్చిన రోజున దీపావళి అని ఉత్తరాది వారు జరుపు కుంటారు. తిమిరాన్ని సంహరించి వెలుగులు ప్రసాదిస్తుంది దీపావళి. ఉదయాన్నే  ఇంటిల్లిపాది దీపావళి నాడు శరీరానికి తైలం రాసుకుని అభ్యంగన స్నానం చేయడం ఆనవాయితీ.

దీపాలు అంటే జ్ఞానదీపంగా భావించేవారు. నాడు పూజలు, దీపాలు పెట్టడం దీపావళికి ప్రత్యేకమైన పండగగా భావించాలి. దీపావళి అమావాస్యను తెలుగులో దివ్యల అమావాస్య అంటారు. దీపాలు పెట్టడాన్ని దివ్యలెత్తు అంటారు. దీపావళి కాంతుల్లో వెలుగులను ప్రతిబింబి స్తాయి. దీపావళి ఐదు రోజుల పండగ. గతంలో దీపాలు ఎక్కువగా పెట్టేవారు. శుచి, శుభ్రత పాటించాలి. దీపాలు పెట్టడంతో చలి వాతావరణం కాస్త ఉష్ణం పెరుగుతుంది. లక్ష్మీ పూజతో దారిద్యం తొలగుతుంది. కారణం ఏదైనా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. నరక చతుర్దశి రోజే సత్యభామ నరకాసురుడిని వధించడం వల్ల దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

నరకాసురుడునే రాక్షసుడి పీడ వదిలినందుకు ప్రజలు ఆనందంగా సత్యభామా కృష్ణులకు స్వాగతం పలికి దీపాలు వెలగించారని పురాణాలు చెబుతున్నాయి.  సత్యభామ నరకున్ని వధించడంతో ప్రజలు బాణాసంచా పేల్చి సంబరాల్లో మునిగిపోతారు. ఇకపోతే దీపావళి లక్ష్మీపూజలకు కూడా ప్రత్యేకం. అమ్మవారిని కొలవడం, ధనపూజలు చేయడం ఈ పండగ ప్రత్యేకం. దీపావళి సాయంత్రం ధనలక్ష్మి పూజతో వేడుకలు ప్రారంభం అయ్యేవి. దీపాలు పెట్టడం తోటే పండగ మొదల య్యేది. ఆ రోజునే దీపాలు పెట్టడానికే అమిత ప్రాధాన్యం నిచ్చేవారు. అమావాస్యరోజు చీకటి సమూలంగా దూరమవుతుంది. దీపం అంటేనే జ్ఞాన దీపంగా భావించేవారు. ఇంటి చుట్టు, పైన దీపాలను మట్టి ప్రవిూదలలో నూనె పోసి ధారంతో నేసిన వత్తులను వెలిగించేవారు. ఇదే సందర్భంగా బాణాసంచా కాల్చడం ఆనావాయితీగా వస్తోంది. మొత్తంగా దీపావళి అన్నది వెలుగులు నింపేద పండగ. ఇకపోతే తెలంగాణలో కొత్తగా పెళ్లయిన ఆడ పడచులను తీసుకుని వచ్చి కొత్త గా వచ్చిన అల్లుళ్లను పండగలకు తోడ్కొని రావడం కూడా వస్తోంది.

దీపావళి ప్రధానంగా తెలుగువారింట వెలుగు నింపే పండగ. ప్రదోష సమయంలో సాయంత్రం 5.35 గంటల నుంచి 6.30 గంటల వరకు లక్ష్మీ పూజ చేయడం సంప్రదాయంగా ఉండేది. అమావాస్య నాడే ఈ దివ్వెల పండగ జరుపుకోవడం వెనక ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. చీకట్లో దీపాలు బాగా వెలుగుతాయని.. ఆ చైతన్య దీపాలు, జ్ఞాన జ్యోతులు మన జీవితాల్లోని నిరాశలను తొలగిస్తాయనే ధైర్యాన్నిచ్చే ఉత్సవం ఇది. నరకాసుర సంహారం జరిగింది కాబట్టి ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి ఉత్సవం చేసుకున్నారని  భాగవతంలో ఉంది. పూర్వం దీపావళి రోజున దీపాలు పెట్టడం ప్రారంభించి కార్తీకం అంతా కొనసాగించే వారు.

ఉత్తరాది వారు ధంతేరాస్‌ అంటే బంగారం అమ్మకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజు బంగారం కొంటే మంచిదన్న నమ్మకం ఉంది. అలాగే దీపాశళికి నోములు,వ్రతాలు ఆచరించడం కూడా ఉంది. సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో శ్రీహరి హృదయం ఆక్రమించుకున్న అమ్మవారు భక్తుల కోసం  శ్రీమహాలక్ష్మీ పూజలందుకునే రోజున దీపావళిగా పూజిస్తారు.  అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రధానంగా ధనానికి రూపంగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి రోజు, మరునాడు వ్రతాలు ఆచరించడం కూడా ప్రత్యేకంగా చేస్తుంటారు. మహాలక్ష్మి అమ్మవారికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. యోగనిద్రలో ఉన్న విష్ణువు రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుతో తన్నారు.  దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి  తపస్సులో మునిగిపోయింది. భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడని పురాణైతిహ్యం. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అలా వచ్చిన శ్రీమహాలక్ష్మి కొల్హాపురంలో వెలసినట్లుగా చెబుతారు. మరికొందరు పద్మావతిగా  అవతరించిందని అంటారు.  అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో ఆయా క్షేత్రాలు  ప్రసిద్ది చెందాయి.

లోకమాత జగదాంబ కరుణాకటాక్షాల కోసం అష్టయిశ్వర్యాలు సిద్దించాలని అనాదిగా పూజలు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే దీపావళికి ధనపూజలు చేయడం అన్నది వాడుకలోకి వచ్చింది. వేల సంవత్సరాల నుంచి  మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. ఇక అర్ధరాత్రి వేళ దీప కాంతుల నడుమ శ్రీ మహాలక్ష్మిని శ్వేత పుష్పాలతో అష్టోత్తరశత నామాలతో ఆరాధిస్తే సిరుల తల్లి అనుగ్రహం అపారంగా ఉంటుంది. దశాబ్ధాలుగా దీపావళి ఎంతో విశిష్టంగా, సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకుంటున్నారు. దీనికి భాషా,ప్రాంత భేదాలు లేవు. ప్రధానంగా హిందూ సంప్రదాయం అనేది నాటి దీపావళి పర్వదినాన కనిపించేది. ఇకపోతే దీపావళి మరునాడు  కేదార గౌరీ వ్రతం ఆచరించడం సంప్రదాయం. సాయంత్రం వేళ ఇంటి ముందు దీపకాంతులు దారిద్య నాశనానికి ప్రతీక. అందుకే దీపాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.