పథకాల..ప్రలోభాల కాలం పోయింది ! 

పథకాల..ప్రలోభాల కాలం పోయింది !

ఉభయ తెలుగు రాష్టాల్ల్రో జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు…అధికార పార్టీలు ముందుగా ఊహించనవే అని చెప్పాలి. ఎపిలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మృతితో ఆయన భార్య డాక్టర్‌ దాసరి సుధను  బరిలో నిలపడం..ఆమె భారీ మెజార్టీతో గెలవడం పెద్దగా సంచలనం కలగలేదు. ఎందుకంటే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో అక్కడ విపక్ష టిడిపి బరిలో దిగలేదు. ఎన్నికల్లో ఆమె మెజార్టీ సిఎం జగన్‌ రికార్డును బద్దలు కొట్టినా జనంలో పెద్దగా ఆసక్తి కలగలేదు. అయితే దీనికి ఉప్పొంగి పోయి…ప్రజలంతా మనవెంటే ఉన్నారను కోవడమే పొరపాటు. ప్రజలు మనవెంట ఎప్పుడూ ఉంటారన్న ధీమా ఉండాలి. అందుకు తగిన కసరత్తు చేయాలి. ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బులు గుమ్మరించడం ద్వారా ఎల్లవేళలా గెలవలేమని హుజూరాబాద్‌ ఫలితంతో అర్థం చేసుకోవాలి. ఎన్నికల కోసమే పథకాలను ప్రవేశ పెట్టడం మంచి సంప్రదాయం కాదు.

నిరంతరంగా  ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో చిన్నవైనా, పెద్దవైనా అవి విపక్షాల కుట్రగా తీసు కోవడం సరికాదు. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని సకాలంలో గుర్తించాలి. సమరంలో మేమే గెలుస్తామన్న అహంకారం పనికిరాదని గుర్తించాలి. ప్రజలకు మేలు చేయడానికి, సక్రమ పాలన అందించడానికే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప..తాము చేసే పనులకు మద్దతు ఇచ్చారని ప్రకటించుకోవడం సరికాదు. తాము తసీఉకున్న నిర్ణయాలన్నీ భేషుగ్గా ఉన్నాయని ప్రకటించుకోవడం కూడా మూర్ఖత్వమే కాగలదు. ఒక్క హుజూరాబాద్‌లో చేసిన ఖర్చుతో ఎన్నో మంచి పథకాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అలా  కాకుండా డబ్బులతో గెలవాలి..పథకాలతో గెలవాలన్న దురాలోచనలో పాలకులు ఉండడం సర యింది కాదు. ప్రజలు మనవెంట ఎల్లవేళలా ఉండేలా చేసుకోవడం ప్రజాస్వామ్యంలో అవసరం. అందుకు ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారికి మనము న్నామన్న ధైర్యం కలిగించాలి. అవన్నీ ఈటెల రాజేందర్‌ కల్పించారు. అక్కడి ప్రజలతో నిత్యం మమేకం అయ్యారు. అందుకే ప్రజలు ప్రలోభాలకు, డబ్బుకు లొంగలేదు. డబ్బులు పంచారు కనుకనే గెల్లు శ్రీనివాసయాదవ్‌కు కనీసం 80వేల వరకు ఓట్లు పడ్డాయి. ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు పంచినా ఈటెలకు లక్షకు పైగా ఓట్లను కట్టిపెట్టారు. ఈ తేడాను కెసిఆర్‌, కెటిఆర్‌, ఆయన అనుచర గణం గమనించాలి.

నిజానికి ఉద్యమనేత అయిన ఈటలను తప్పించడం, ఉప ఎన్నికల్లో ఓడిరచడం అన్న ఆలోచనే తప్పని గమనించాలి. హుజూరా బాద్‌ ఓటమి పెద్ద అంశమే కాదన్న రీతిలో మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేయడం అహంకాన్ని చూపిందే తప్ప ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఎక్కడా చెప్పలేక పోయారు. దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూసిన హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నిక, అధికార, ధన దాహానికి అద్దం పట్టింది. సామాన్యుడిని గెలవడం అంత సులువు కాదని నిరూపించింది. ప్రజలను డబ్బులతో కొనలేమని తెలియచేసింది. నిజానికి ఈటెలను మంత్రి వర్గం నుంచి తప్పించిన సమయమే ప్రజలకు బాధ కలిగించింది. అహంకాపూరితంగా ఆయనపై నిందారోప ణలు వేసి తప్పించిన తీరును ప్రజలు జీర్ణించుకోలేదని అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా గుర్తించాలి. కొవిడ్‌ కల్లోల సమయంలో అత్యంత కీలకమయిన ఆరోగ్యశాఖను నిర్వహిస్తూ ఉండిన ఈటల రాజేందర్‌ను అవమా నకరంగా మంత్రివర్గం నుంచి తొలగించి, ఆయన విూద అకస్మాత్తుగా పుట్టుకువచ్చిన ఆరోపణలపై ఆగమేఘా ల విూద విచారణలు నిర్వహించి, ఊపిరాడనివ్వకుండా చేసిన తీరు ఎవరినైనా ఆలోచింప చేస్తుంది. కట్టుకథ లు అల్లితే ప్రజలు హర్షించరని గుర్తించాలి. ఎంతో ధైర్యంగా ఆయన ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్న సమ యంలో అర్థాంతరంగా తొలగించడం వల్ల ప్రజలకు మేలు కాదుకదా..కీడు జరిగింది.

కరోనా సమయంలో మంత్రి లేకుండా పోయారు. పర్యవసానంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఉద్యమ నేతగా కెసిఆర్‌కు చేదోడువాదోడుగా ఉన్న కెసిఆర్‌ గుండెలవిూద చేయి వేసుకుని ఆలోచన చేయాలి. ఈటెలపై వేసిన అభాండాలు సరైనవి కావని ఆయనకూ తెలుసు. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈటెల తన వ్యక్తిగ ఛరిష్మాతో విజయం సాధించారే తప్ప బిజెపి వల్ల కాదని కూడా కమలనాథులు గుర్తించాలి. బిజెపిపై తీవ్ర ఆగ్రహం ఉన్నా..ఈటెలపై ప్రేమతో ప్రజలు గెలిపించారు. ఈ ఉప ఎన్నిక ఫలితంతో తాము తెలంగాణలో బలపడ్డామని కమలనాథులు పొంగిపోతే దానికి వారి ఖర్మ అని ఊరుకోవాలి.  వందలకోట్ల పార్టీధనాన్ని, వేలకోట్ల ప్రభుత్వ ధనాన్ని అక్కడ గుమ్మరించినా..నిఖార్సయిన ఉద్యమనేతగా ఈటెల పైకి తన్నుకుంటూ వచ్చారు. ప్రజల గుండెల్లో నిలిచిన నేతగా తనను తాను నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో నోటాకన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న బిజెపి ఈ సారి లక్షకు పైగా సాధించడానికి అభ్యర్థి ఈటెల రాజేందర్‌ కు ఉన్న బలమే తప్ప పార్టీ బలం కాదన్నది గుర్తించాలి. అయితే అందుకు బిజెపి అంగబలం తోడయ్యింద నడంలో సందేహం లేదు.

టిఆర్‌ఎస్‌ ను నిలవరించడంలో వారు గట్టిగానే పోరాడారు. అన్యాయం జరిగిందని ప్రజలు గుర్తించి, అక్రమాలను నిరోధించాలనుకున్న చోటల్లా హుజూరాబాద్‌ లాంటి ఫలితమే వస్తుంది. వందల వేల కోట్లు కుమ్మరించినా  ప్రజల మనసులను గెల్చుకోలేమని ..ఫలితం అనుకూలంగా రాదని… హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితం నిరూపించింది. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, పరిపాలన లో సమష్టి భాగస్వామ్యం వంటి విలువలను తుంగలో తొక్కడం తగదని పాలకులు గుర్తించాలి. ప్రజాస్వా మ్యం ముసుగులో ఏకస్వామ్యం చెలాయించాలనుకున్నా… డబ్బుతో దేనినైనా కొనగలమనుకున్నా.. అది చెల్లుబాటు కాదని హుజూరాబాద్‌ తో పాటు పలు ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలతో పాలకులు గుర్తించాలి. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను నెరేవర్చామని పదేపదే ప్రకటించుకుంటున్న నేతలు ప్రజల మనోగతా లను పట్టించుకోవడం లేదు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అవినీతిని పట్టించుకోవడం లేదు. దోపిడీని గుర్తించడం లేదు. అంతా బాగుంది.. తెలంగాణను బాగు చేశాం అనుకోవడం సరికాదు. ఇచ్చిన హావిూలు ఇవ్వలేదనడం.. బుకాయింపులు చేయడం వంటి ఆలోచనల నుంచి బయటపడాలి. గెలిచిన వారు, ఓడిన వారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా ప్రజలకు చేరువ కావాలి.