ఉగాది కానుకగా రానున్న సర్కారువారి పాట

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజా చిత్రం ’సర్కారువారి పాట’ పరశురామ్‌ దర్శకత్వంలో ప్రస్తుతుం సెట్స్‌ పై ఉంది. ఇటీవల ఈ సినిమా స్పెయిన్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.  కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని ఇప్పుడు సంక్రాంతి రేసులోంచి తప్పించడం టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్‌ వేదికగా నిర్మాతలు ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నపెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సీజన్‌ లో విడుదలైన మహేష్‌ బాబు  పోకిరి, భరత్‌ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌ గా నిలిచాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేయనుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంట్టంల్గªన్మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ల విూద నవీన్‌ యెర్నేని, వై రవి శంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో సముద్రఖని విలన్‌ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇతర పాత్రల్లో

సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌ నటిస్తున్నారు. బ్యాంకింగ్‌ స్కామ్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోన్న ఈ సినిమా మహేశ్‌ బాబు కు ఏ రేంజ్‌ లో సక్సెస్‌ అందిస్తుందో చూడాలి.