సూర్యవంశికి రాజమౌళి అభినందనలు

బాలీవుడ్‌ యాక్షన్‌ ట్రయో అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌ గన్‌, రణ్వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ’సూర్యవంశి’. హీరూ యాష్‌ జోహార్‌, అరుణ భాటియా, కరణ్‌ జోహార్‌, అపూర్వమెహతా, రోహిత్‌ శెట్టి సంయుక్తంగా నర్మించిన ఈ సినిమా అత్యంత భారీ బ్జడెత్‌ తో రూపొందింది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ముంబైలో బాంబ్‌ దాడి చేసిన టెర్రరిస్టుల్ని ఏరి పారేయడానికి స్పెషల్‌ గా నియమింపబడ్డ ముగ్గురు పోలీస్‌ ఆఫీసర్స్‌ .. వారిని ఎలా ఎదుర్కొంటారు అనేదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా విడుదల సందర్బంగా.. దర్శకధీరుడు రాజమౌళి ’సూర్యవంశి’ చిత్ర బృందానికి స్పెషల్‌ విషెస్‌ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ’సూర్యవంశి’ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఒకేడాదిగా ఈ సినిమా విడుదల కోసం ఓపిగ్గా వెయిట్‌ చేసి.. కఠిన పరిస్థితుల్లో సైతం థియేటర్‌ బిజినెస్‌ ను సక్సెస్‌ ఫుల్‌ గా కంప్లీట్‌ చేసిన టీమ్‌ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. రాజమౌళి సూపర్‌ హిట్‌ చిత్రం విక్రమార్కుడు చిత్రాన్ని బాలీవుడ్‌ లో రౌడీ రాథోడ్‌ గా రీమేక్‌ చేసింది రోహిత్‌ శెట్టి అని, అలాగే అందులో  హీరోగా నటించింది అక్షయ్‌ కుమార్‌ అన్న సంగతి తెలిసిందే.  చాలా కాలం తర్వాత థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న హిందీ సినిమా అక్షయ్‌ కుమార్‌ నటించిన సూర్యవంశి దివాళి కానుకగా థియేటర్లలో రిలీజవుతున్న సూర్యవంశి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని, ఇలాంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయాలని కోరుకున్నాడు అల్లు అర్జున్‌. తాజాగా మరో టాప్‌ టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎస్‌ఎస్‌ రాజమౌళి  సూర్యవంశి టీంకు మద్దతుగా నిలిచారు.