బాలయ్యకు శస్త్ర చికిత్స

-కంగారు పడ్డ అభిమానులు
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడనే విషయం తెలిసిన వెంటనే నందమూరి అభిమానులు కంగారు పడ్డారు. ఏమైంది అంటూ ఆరా తీశారు. సోషల్ విూడియాలో ఆయన గురించి వెతకడం మొదలు పెట్టారు. అయితే బాలకృష్ణకు జరిగింది చిన్న సర్జరీ అని తెలిసిన తర్వాత వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 31న కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన బాలకృష్ణ.. రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సీనియర్ డాక్టర్ల బృందం ఆయనకు నాలుగు గంటల పాటు శ్రమించి షోల్డర్ సర్జరీ చేశారు. గత ఆరు నెలలుగా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నారు. అయితే బిజీగా ఉండడంతో సర్జరీ కోసం టైం ఇవ్వలేకపోయారు. బోయపాటి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం..కొన్ని రోజులు విశ్రాంతి దొరికింది. దాంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు బాలకృష్ణ. ఆయన్ను ట్రీట్ చేసిన వైద్యులు కూడా బాలయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని.. షూటింగ్స్‌కు దూరంగా ఉండాలని వాళ్లు సూచించారు. 6 వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత బాలయ్య మళ్లీ షూటింగ్‌కు రావచ్చు. అంటే డిసెంబర్‌లో గోపీచంద్ మలినేని సినిమా మొదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.