50కోట్ల క్లబ్‌లో చేరిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాల తర్వాత అఖిల్ నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, రొమాంటిక్ ఫీల్‌గుడ్ మూవీ లో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు , వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా, తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అఖిల్ కెరీర్‌లో మొదటి 50 కోట్ల సినిమా ఇదే కావటం విశేషం. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకు కూడా ఈ చిత్రం ఎంతో బాగా నచ్చింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కెమిస్టీక్రి తోడు గోపీ సుందర్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో భాగం అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు 19.71 కోట్ల బిజినెస్ జరిగింది. 16 రోజుల్లోనే ఈ చిత్రం 23.42 కోట్లకు పైగా షేర్ వసూలు చేయటంతో అన్నిచోట్లా డిస్టిబ్యూట్రర్లు లాభాల్లోకి వచ్చేసారు. మొత్తంగా రూ. 4.5 కోట్ల లాభాలు తీసుకొచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటున్నారు. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు.