దూకుడు విూదున్న రవితేజ

మాస్‌ మహరాజా రవితేజ మంచి దూకుడు విూదున్నాడు. వరుస సినిమాలు అనౌన్స్‌ చేస్తూ అందరికి పెద్ద షాక్‌ ఇస్తున్నాడు. చివరిగా రవితేజ నటించిన క్రాక్‌ చిత్రం పెద్ద హిట్‌ కావడంతో ఆ వెంటనే ఖిలాడి అనే సినిమా షూటింగ్‌ మొదలు పెట్టేశాడు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ’ఖిలాడి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇక శరత్‌ మండవ దర్శకత్వంలో ’రామారావు  ఆన్‌ డ్యూటీ’, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ’ధమాకా’మూవీలతో బిజీగా ఉన్న రవితేజ రీసెంట్‌గా తన 70వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ చేశారు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ విూద అభిషేక్‌ నామా, శ్రీకాంత్‌ విస్సా కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ’రావణాసుర’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ ఈ సినిమాకి ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 5వ తేదీ ఉదయం 10:08 గంటలకు ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చెయ్యబోతున్నారు.దీనికి సుధీర్‌ వర్మ దర్శకుడు. ఇక 71వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది. రేపు మధ్యాహ్నం 12 : 06 నిమిషాలకు అనౌన్స్‌ మెంట్‌ రాబోతోంది. సరికొత్త కాంబినేషన్స్‌ లో ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలతో చెలరేగిపోతున్న రవితేజ ఈ సినిమాలో కూడా నెవర్‌ బిఫోర్‌ అవతార్‌ లో కనిపించబోతున్నారని టాక్‌. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.